పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిక్కడిపురుషులను దాప్యమునుండి యుద్దరింతురేమోయను నమ్మకముతో వానిలోఁగొన్నిటి నిప్పుడు తెలిఁగించుచున్నాను. ఇవిరత్నములని చెప్పఁబడుట కర్హములయినవి కాక పొయినను మన దేశ సంప్రదాయమును బట్టి వీనికి నవరత్నములని పేరుపెట్టుచున్నాను.

శ్రీ సత్యరాజాచార్య కృతాంధ్రీకృత నవరత్న మంజరి.
               క.   పురుషునమ్మహిఁబతత్నియె
                    పరమంబగు దైవతంబు పత్నీసేవన్
                    నిరతనముచేసెడి పురుషుఁడె
                    పరమున నిహమున సుఖంబుఁ బడయుంజుమ్మీ.  ౧
               గీ.   ప్రతిదినంబును బురుషుండు పత్నికంటె
                    ముందుగాలెచి నదిలోనమునిఁగి జలము 
                    కలశమునఁదెచ్చి నిజపత్ని కాళ్ళుకడిగి
                    తానుశ్రీపాదతిర్థంబు త్రాగవలయు.            ౨
               క.   స్త్రీపాదతీర్థసేవన
                    మేపురుషుడుచేయు నెన్నియేఁడులు ధరలో 
                    నాపురుషుఁ  డన్నియుగములు 
                    పావములంబాసి మోక్షపదవి సుఖించున్.       ౩
              గీ.    కుష్టరోగిణియైనను గ్రుడ్డిదైన
                    భూగివికలాంగియైనను ముసలిదైనఁ
                    బత్నియెంగిలి భుజియింపవలయుసతము 
                    పుణ్యలొకంబుఁగాంక్షించు పురుషవరుఁడు.       ౪
              క.    ఏపురుషుఁ డతివయెంగిలి
                    పాపవుమతినేవగించి భక్షింపండో