పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమైనది. కులపురుషునకు విద్యచెప్పుట వలన కులమువారుతన్ను బహిష్కారము చేయుదురేమో యని యామెకుమనస్సులో భయముకలిగినను, భీదదగుటచేత జీతమున కాశపడియు నాయజమానురాలు గొప్పరాజకియోద్యోగిని యగుటచెత నామె యనుగ్రహమును గోరియునాకుఁ బత్నీవ్రత ధర్మముల నుపదేశించి తనదేశమయొక్క యాధిక్యమును నకుబొధపరుపనెంచియు ఆ పండితురాలు నాకు విద్య చెప్పుట కొప్పుకొనెను. పత్నివ్రత శబ్దము వినఁగనే మీ మనస్సుల కద్భుతముగా నుండవచ్చును. ఆభాషలో భార్యకు ‘పంధీ’ యని పేరు. పంధీ శబ్ధమునకు యజమనురాలని యర్దము. భర్తను ‘భూదా’ యందురు. భూదాయనఁగా దాసుఁడని యర్థము. ఈ రెండు పేరులఁబట్టియే యక్కడ భార్యాభర్తలకుండు సంబంధమును మిరూహించి తెలిసి కొవచ్చును. మనదేశములో స్త్రీలకు పతివ్రతా ధర్మములుపదేశించునట్టే, ఆ దేశములో పురుషులకు పత్నివ్రతదర్మములు నేర్పుదురు మాయుపాధ్యాయిని ‘పంధీమేడిభూడీ’ యను గ్రంధములోని నూఱు పద్యములు నాకు నేర్పినది. ఆ పుస్తకమును ‘పత్నివ్రత ధర్మభోధిని’ యని తెనిఁగింపవచ్చును. వారిభాషలో ఒత్తక్షరము లధికముగానున్నవి. రెండేసియక్షరముల పదములు విస్తారము; పదములు తఱుచుగా ఆకారాంతములుగాను ఈ కారాంతములుగాను ఉండును; ఏకారము ప్రశ్నార్థకము. భాషసంగతి యటుండనిండు, ఫిండీగారు నాకుపదేశించిన పద్యములను మొదట నేను ప్రితితోవల్లించితినినిగాని నాకామెవానియర్దము చెప్పఁగానే నాకెక్కడలెని కొపమునువచ్చి, ఆమెనన్ను విడిచి యింటికి పొఁగానే దొడ్డిలొనిపొయి యెవ్వరును జూడకుండ నిప్పంటించి యాపుస్తకమును తగలఁబెట్టితిని. కానీ యిప్పటికిని నాకొపము తీరినది కాదు. ఆపద్యముల యర్థము విన్నపక్షమున నాకంటెను మికెక్కువ కోపమురావచ్చును. ఆకొపములవలన నైనను మిరీదేశమునకు వచ్చి