పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వ దేశ యాత్రలు

కయి నడుచునప్పుడు నేనాదారిని సర్వమును కొలిచి గుఱుతులు పెట్టుకొని తరువాత పుస్తకములో వ్రాసికొన్నాఁడను. ఒక్క యక్షరమయినను హెచ్చుతగ్గులేకుండ నేనప్పుడు వ్రాసికొన్నట్లు మీకది యిప్పుడు చెప్పెదను శ్రద్ధవహించి వినుఁడు. పట్టణము వెలుపలనున్న పెద్దరావిచెట్టు మొదలుకొని యిసుకలో ముక్కుకు సూటిగా వాయవ్యమూలను మూఁడుమూరలు తక్కువగా ముప్పావుక్రోసుదూరము నడచిన తరువాత వెలగచెట్టువద్ద మోచేతివంపుగా తిరగవలెను. అక్కడ నుండి యెడమచేతిమీఁదుకా పావుక్రోసుమీఁదనడచి చిన్న మోదుగురుప్ప కనబడ్డ తరువాత కుడివైపునకు తిరిగి క్రోసుమీఁద మూఁడు మూరలదూరము పోవునప్పటికి చిట్టడవి కనఁబడును. ఆ యడవిలో దూరి జువ్విచెట్టున కెదురుగానున్న నడదారిని ఎడమవైపునకును కుడి వైపుకును ముందుకును వెనుకకును వంకరటింకరగా దారిపోయి నట్లెల్లను అరక్రోసుమీఁద తొమ్మిదిబారల మూఁడుమూరల రెండడుగుల నాలుగంగుళములు నడవఁగానే యొకకొండ కానఁబడును. ఆకొండ మీఁదికి తిన్నగా పదినిలువులు బారెడుదూరమెక్కి మూలగా మూఁడు నిలువుల మూరెడుదూరము దిగఁగానే చిట్టీతపొచాటున గుహయొకటి కనఁబడును. మీరీకొలతలు మఱచిపోయిన పక్షమున దారితప్పి చిక్కులు పడవలసివచ్చుకనుక దీనిని మీరు సంధ్యావందనము వల్లించినట్లు నిత్యమును త్రికాలములయందును వల్లింపుఁడు. నేనాగురూప దేశమును భగవద్యాక్యముగా నమ్ముకొని, అంధకారబంధురముగానున్న యీగుహలో ప్రవేశించి కొంచెముదూరము నడుచునప్పటికి కాలుజారి క్రిదపడ నారంభించితిని. ఆప్రకారముగా యోజనదూరము పడువఱకును వేఁడి యంతకంతకెక్కువయి దుస్సహముగా కనఁబడెనుగాని తరువాత వేఁడియంతకంతకు చల్లారి యెంతో మనోహరముగానుండెను. క్రిందికి పోయినకొలఁదిని భూమిలోవేఁడి యంతకంతకు