పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడు మళయాళము

యేద"ని నేనాయనను రహస్యముగా నడిగితిని. ఆయన మొట్ట మొదట మర్మము విడిచి చెప్పక "యిదే ఆడమళయాళ" మని సెలవిచ్చెను. బుద్ధిమంతుఁడను గనుక నే నామాటలంతటితో నమ్మక "యిదే ఆడమళయాళమయితే యిక్కడ మగవాళ్లెందుకుకున్నారు? ఆడ మళయాళమ్లో మగవాళ్ళక్కర లేకుండా గాలికి బిడ్డలు పుడుతారని మాదేశంలో తెలిసిన పెద్దలునాతో నమ్మకంగా చెప్పినారు. ఆది యిక్కడ యెక్కడా కనపడడం లేదు. బ్రాహ్మలలో ఆడవాళ్లు పైటవేసుకోకుండ వుండడమూ స్త్రీలలో చాలా మంది పెళ్లిళ్లులేకుండా తమ మనసు వచ్చినవాళ్లను వుంచుకొని మనసువచ్చినప్పుడు వదిలిపెడుతూయుండడమూ పుౠషులకు భాగమ్లేకుండా కుటుంబపుసొత్తంతా స్త్రీలే అనుభవిస్తూవుండడమూ కన్న కొడుకులు రాకుండా రాజ్యానికి తోడఁబుట్టిన దాని కొడుకులు వస్తూవుండడమూతప్ప మాదేశానికీ యీ దేశానికీ యేమీ భేదం కనబడడంలేదు. ఇది ఆడమళయాళం కాదు ఆడమళయాళం యెక్కడవున్నదో చెప్పక తప్పదు" అని ఆయన కాళ్లమీఁదపడి లేచినానుకాను. ఈప్రకారముగా నేనాయనకు పరమభక్తితో మాసముదినములు శుశ్రూష చేయునప్పటికి నాయందాయన కపరిమితానుగ్రాహమువచ్చి, ఒకనాఁడు ప్రాతఃకాలమునందు సన్నాయన స్త్రీమళయాళమునకు దారిచూపెదను రమ్మని పట్టణమునకు వాయవ్య దిక్కున రెండుక్రోసుల దూరము కోనిపోయి, ఒకయడవిలో ప్రవేశించి కొంచెము దూరము నడచి యొకచిన్న కొండయెక్కించి దానిలో నున్న గూహయొక్కటిచూపి ఆడుమళయాళమున కిదేదారి భయపడక పోమ్మని చెప్పెను. ప్రాణాధికులయిన నాదేశస్థులలో నావలెనే స్త్రీమళయాళమునకు పోవనుద్దేశించుకొన్నవా రున్నపక్షమున వారితరులనెవ్వరిని అడిగి తెలిసికోవలసిన పని లేకుండ వారికి వివరముగా తెలుపుట