పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/259

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఆడుమళయాళము

హెచ్చుచుండుననియు, కొంతదూరము పోయిన తరువాత అగ్నిమయమయి భూమధ్యమున సమస్తము కరిగి ద్రవరూపముగా నుండుననియు, చిన్నప్పుడు పాఠశాలలో మాయుసాధ్యాయుడు చెప్పెనుగాని, ప్రకృతి శాస్త్రవేత్తల మనుకొను హూణపండితులు చెప్పిన యీ సంగతి యసత్యమనియు మన పురాణములే నిజములనియు నేనిప్పుడనుభవము చేత కనిపెట్టితిని. ఈ విషయముునందు సందేహముగలవారు నన్ను వచ్చి యడిగిన పక్షమున నేను సర్వమును సరహస్యకముగా చెప్పి సంశయ నివృత్తి చేసి పంపెదను. ఇట్లు కొంత దూరము పడిన తరువాత నా కాలికప్పుడేదో దూదివలె మెత్తగా తగిలినది. ఆయాసపడి యుండుట చేత నేనప్పపుడు దాని మీద కాలూని కూరుచుండి వీపు మీద వెనుక కొరిగినాను. ఇంతవఱకును నేను ప్రత్యక్షముగా చూచినది. ప్రత్యక్ష ప్రరమాణము సర్వోత్కృష్టమయినదని యెల్ల మతములవారు నంగీకరించినదేకదా? అంతట నాకు నిద్రపట్టినది. ఆ నిద్ర యెన్నిదినములున్నదో యేయేదారిని జరిగినానో నాకప్పుడు తెలియలేదుగాని నిద్ర తెలిసి నేను కన్నులు విచ్చి చూచునప్పటికి నేనొక గుహసమీపమున రాతి మీద పరుండి యుంటిని. సూర్యుడప్పుడే పశ్చిమమున నుదయించుచుండెను. ఇక ముందు చెప్పబోవు రీతిగా ఆ దేశాచారములు మన దేశాచారములకు విరుద్ధములయినట్లే యక్కడి సూర్యుడును పడమట నుదయించి తూర్పున నస్తమించుచుండును. అంత వరకును నాకాకలి కాకుండుటయు, దేహమున గాయములు తగులకుండుటయు, నిద్రపట్టుటయు, అంతయు మా గురుప్రభావము చేత నయినదేసుండీ! నిద్రలో నున్నంతవఱకును క్షుత్తులేక లేవగానే కలుగుటకు గురుకటాక్షము కాక మఱియేమి కారణముండును.