పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీడాసాఖ్యములను ప్రసాదించెను. వాయు మహిమచేతఁ గలిగిన వికారమును వాంతులును నాకసాఖ్యమును కలిగించినట్లు మీరెంచు కొందురేమోకాని నిజము విచారింపక నాకవి మంచి వైద్యులవలె లోని కల్మషమును పోగొట్టి యారోగ్యమునే కలిగించి నన్ను మహబలుని వంటి సత్వసంపన్నునిగా జేసినని. నేనోడలోనున్న మూడుదినములును ఉపవాసవ్రతము పూనియుండిన సంగతి బుద్ధిమంతులైన మీరివరకే యూహించి యుందురు.నాభాగ్యము నేమనిచెప్పను? అందులో కపటిదినము ఏకాదశికూడ నయ్యెను.అకడపటినాటి నిరాహారపుణ్యమున కెందైన సాటికలదా? తక్కిన రెండుదినముల యుపవాసఫలమును పొగయెడనెక్కిన పాపమునకు సరిపోయినను హరివాసరమునాటి శుష్కోపవాస పుణ్యఫలము నాకు మిగిలియుండక మానదు. శ్రీహరి కరుణాకటాక్షము గలవారి కెక్కడకు పోయినను పుణ్యమునకులోపముండదు. అటుతరువాతి చరిత్రము వినుడు.


రెండవ ప్రకరణము

నాలవనాఁడు ద్వాదశిపారణమున కనుకూలముగా ప్రాత:కాలముననే పొగయోడ చెన్నపురి రేవు చేరెను. ఓడ లంగరు వేసిన తరువాత చిన్నపడవ లనేకము లక్కడకు రాగా నేనొక పడవలో నొక్కి యొడ్డునకు పోతిని. ఒడ్డు నుండి నూరు గజముల దూరము నడచునప్పటికి గుఱ్ఱపు బండి యొకటి కనబడెను.

"వూళ్లోకి బండి అద్దెకు తీసుకువస్తావా?" అని నే నాబండివాని నడిగితిని. వాఁడేమో అఱవములో మాటాడఁగా నేను తెలిసి కోలేక "నీకు తెలుగు తెలుసునా?" అని వాని నడిగితిని. అప్పుడు మా యిద్దఱికిని యీ క్రింది సంభాషణము జరిగినది.