పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నయినను తరువాత ప్రాయశ్చిత్తము చేయించుకోవచ్చునని పూటకూటి యింటికి పోయి శీఘ్రముగా భోజనము చేసివచ్చి, ౧౮౭౯వ సంత్సరము మార్గశిర మాసంలో భానువారము నాఁడొక చిన్న పడవలో పోయి పొగయెడలో నెక్కితిని. ఇరువది యేడవ యేట నాకు దేశాంతర యాత్ర నా జాతకములోనే వ్రాయఁబడియున్నది. ఎక్కినజాములో పొగయోడకదలి నాల్గవనాఁటి ప్రాత:కాలమున నన్ను చెన్నపురికిఁ గొనిపోయి విడిచినది. పొగయోడలోని యవస్ధ యీకాలమునందు సముద్రయాత్రలు చేయువారి కందఱికిని తేలిసినదే యగుటచేత నేనిక్కడ వివరింప నక్కరలేదు. ఒకవేళ సముద్రయాత్రలు చేయని సిష్టుల లాభామునిమిత్తము వివరింత మన్నను, పొగయోడలో నెక్కిన తరువాత మరల దిగువఱకును నాకు దేస్మృతియేలేదు. నేనెఱిఁగినదంతయు నా కడుపులో నేదో వెఱ్ఱి వికారమారంభమయి నాటి దినము తిన్న యన్నము మాత్రమే కాక చిన్నప్పటి నుండియు కడుపులోనున్న పసరంతయు వాంతులగుటయు, దేహముతూల లేవశక్తుఁడనుగాక కన్నులు మూసుకోని శవమువలె నొకమూల పడియుండుటయు, మాత్రమే. ఇప్పడింకొక సంగతి కూడ స్మరణకు వచ్చుచున్నది. నేను చిన్నతనములో నుయ్యెలలో నంతగా నూఁగలేదు. ఓడలోనున్న మూఁడు దినములలోను నాకు యావజ్జీవమును సరిపోవునంత యుయ్యాల లూగుట సంభవించినది. ఆసౌఖ్యమనుభవైక వేద్యమేకాని చెప్ప నలవియైనది కాదు. నేను పడవ దిగి మెట్టకుపోయిన తరవాత కూడ కొన్ని దినముల వరకును నేనుయ్యాలలో నూగుచున్నట్టే భ్రమ పడుచుంటిని. నా కీడోలికాక్రీడ మొదలయిన వైభవములు కలిగించిన వాడు మా ముఖ్యప్రాణదేవుడే. భక్తవత్సలుఁడగుట చేత వాయుదేవుఁడు భక్తుఁడనయిన నేనొంటిగా పోవుట చూచి సహించలేక తన మహాబలత్వము సార్ధకమగునట్లుగా సముద్రము పొడుగునను నాకు తోడుగా వేంటవచ్చి నాకీ