సత్యరాజాపూర్వదేశ యాత్రలు
250
బండివాడు____యెక్కడికి పోతావు?
నేను___వంటపూటియింటికి.
బండి___యెక్కడికీ ?
నేను___వంటపూటియింటికి.
బండి___తెలుగులో చెప్ప.
నేను___వంటపూటియింటికి.
బండి___పూటకూటీ ? నీకు తెలుగూరాదా ?
నేను___పూటకూటీయిల్లంటే డబ్బులుపుచ్చుకొని అన్నం పెట్టేయిల్లు. అక్కడికి తీసుకొని పోవలెను.
బండి___దుడ్డుతీసి అన్నంవేసే యింటికి నిన్ను యెత్తుకుపోయి విడవవలెనా ?
నేను___పొగబండి యెక్కేచోటికి చేరువగావుండే యింటికితీసుకుపో తెలిసిందా ?
బండి___తెలిసింది. ముక్కాలురూపాయి వుక్కారుంగో.
నేను___ముక్కాలురూపాయీకాక యింకా వుక్కారుంగో యేమిటి? తరువాత చిక్కులు పెట్టక బేరం యిప్పడే తిన్నగా చెప్ప.
బండి___అన్నసత్రానికి యెత్తుకుపోయి విడిచి పూడుస్తాను. కూర్చో,ముక్కాలురూపాయి యియ్యి.
అని బండివాడు నాకర్ధముకాక పోయినను ,ఇయ్యవలసిన సొమ్ము స్పష్టముగా తెలిసినందున బండిలో నెక్కి కూరుచుంటిని.వాడు బండిని వీధిలో నుండి తోలుకోని పోవుచుండగా వీధి కిరుప్రక్కలను మంచి మేడలను దివ్వభవనములును కన్నుల పండువుగా నుండెను. నడుమనడుమ పలకమీద పెద్ద అక్షరములతో ___వారి అన్నస్త్రము అని వ్రాయబడియుండెను.వాని సంఖ్యనుచూచి ఒక్క వీధిలోనిన్ని యన్నసత్రము లుంచుటకు
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/250
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది