పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార 'యా' కారముల కభేదము. అందు చేతనే వంగము మొదలయిన యుత్తరదేశములయం దయెాధ్యకు అజోధ్యయని యకారమునకు మాఱుగా జకారమును వాడుదురు. ఈ శాస్త్ర చర్చ నింతట విడిచిపెట్టి కార్యాంశమునకు వత్తము. నా పేరు యొక్క యుచ్చారణక్రమ మెట్టిదయినను నాది సార్థక నామధేయమని నేను వేఱుగ చెప్పనక్కఱలేకయే నేను వివరింపఁబోయెడి యీ సత్యయాత్రాచరిత్రమే లోకమునకు వేయినోళ్ళ ఘోషింపవచ్చును. ఆత్మస్తుతి నింద్యమయినంగున నా సత్యసంధతను గూర్చి నేనిఁక చెప్పను. నేనవలంబించియున్న సత్య మతము కూడ నా చరిత్రమూ యొక్క పరమ సత్యత్వమును సాధింప వచ్చును. సత్యప్రియత్వము చేతనే కదా మామతకర్తలయిన శ్రిమధ్వ రాయలవారు మిధ్యాభూతములయిన పూర్వ మతసిద్ధాంతములనన్నిటిని తిరస్కరించి, శ్రీమదాంజనేయ సహాయము చేతను ముఖ్య ప్రాణదేవుని యనుగ్రహము చేతను ఖిలములయిపోయిన యపూర్వశ్రుతిస్మృతి వాక్యరత్నములను బ్రహ్మలోకము నుండి తెప్పించి బ్రహ్మసంప్రదాయానుసారముగా సత్యమయిన ద్వైత సిద్దాంతమును లోకానుగ్రహార్థము స్థాపించియున్నారు! అటువంటి సత్యమతమున జన్మించి సత్యవ్రతమును పూనియున్న నేను నా గ్రంథమునందు సత్యముకాని వాక్యము నొక్కదానినయినను చొరనిత్తునా? ఓ చదువరులారా! నా మాటనమ్మి యిందలి ప్రతి వాక్యమును వేదవాక్యమునుగా విశ్యసింపుఁడు. నేనిందు తెలుపఁబోయెడు సంగతు లీవఱకు మనుష్యుల కెవ్వఱికిని తెలియని దేవ రహస్యములయినను స్వదేశస్థులయిన మీయందు నాకుఁగల భ్రాతృస్నేహము చేత మర్మము విడిచి చెప్పివేయుచున్నాను.

మా తండ్రిగారు కర్మిష్ఠులయి, బాల్యము నుండియు వైదికమయి పూజ్యమయిన యాచార్యవృత్తియందే కాలము గడపిన వారయినను, వారి పుత్రుఁడనయిన నాకు మాత్రము పూర్వకర్మానుభవము చేత శిష్య