పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

అన్నవస్త్రములకే యిబ్బందిపడుచుండుటయుఁ జెప్పి సాహయ్యము చేయఁ వేఁడుకొనెను.

రాజ ---- కృతఘ్నుఁడును మిత్రద్రోహియునగు నీవంటివాని కుపకార మెన్నఁడును జేయరాదు. నేను నీకెంతో మేలు చేసినవాఁడనైనను నాకాపద సంభవించినప్పుడు, శక్తిగలవాఁడవై యుండియు నేను వేఁడుకొన్నను లేశమైనను సాయము చేయకపోతిని. దామోదరయ్య ప్రాణమిత్రుఁడుగా నున్నను నీయొద్ద నాఁతడు దాఁచుకొన్న పెట్టెను. మిత్రుని పుత్రునికియక యపహరింపఁ దలచితివి.

నారా ---- ఆసొమ్ము పెట్టెను తనయొద్ద దాచవలసినదనియు దానిని సులభముగా నపహరించవచ్చుననియు సిద్ధాంతియే మొదట నాకాలోచన చెప్పినాఁడు. నేను సొమ్ముపెట్టె నాతనియొద్దఁ బెట్టిన తరువాతఁ తనకందులో సగముభాగము రావలెనని పోరాడి, స్నేహితుని సొమ్ము పరులపాలగుట కిష్టములేక నేనొప్పుకొననందున మీమెప్పునకై పెట్టెను మీకుఁ దెచ్చియిచ్చినాఁడు.

రాజ ---- సిద్ధాంతియే నిన్నుఁ బ్రోత్యాహపఱిచినను సివుసహి తము దోషీనేకాని నిర్దోషివికానేరవు. స్వయంకృతాపరాధమువల ననే నికిప్పుడీదుర్దశ ప్రాప్తించినది కాఁబట్టి యెఱుఁగక చేసికొన్నదాని ఫలము నీవవశ్యముగా ననుభవింపవలెను.

అని చెప్పి రాజశేఖరుఁడుగా రాతని కేమియుపాయుము చెయక సాగనంపిరి. అదిమొదలుకొని రాజశేఖరుఁడుగారు వెనుక సిద్ధాంతి మొదలైనవారి చర్యలవలనఁ దెలివితెచ్చుకొని ముఖస్తుతుల కుబ్బి యెప్పడును ధనము పాడుచేసికొనకయు, నమీపమునకు వచ్చి మంచి