పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

నన్న నపరాధమని యూరకుండి భిక్షానంతరము దక్షిణయియ్యక పోఁగా ఆతనిని మూఁడు మాసములు వెలివేసి యేఁబది రూపాయలు వుచ్చుకొని ప్రాయశ్చత్తము చేయించి తరువాత మతములో కలువుకొన్నాడు.నేను వేంటనే వెళ్ళి మానానిచేత సపరాధక్షమారణము కోరించినంగాని కార్యము సుఝ్టపడదు. కాబట్టి నన్నుబలవంతపెట్టక యీపూటనేపంపివేయవలయును.

రాజ ---- మీరింతగా సెలవిచ్చుచున్నప్పు మిమ్మిఁక నిర్బంధపెట్టం గూడదు.

అని రాజశేఖరుఁడుగా రాయలను క్రొత్తబట్టలు కట్టబెట్టి సమస్త విధముల గౌరవించి, కృతజ్ఞతాసూచకముగా ప్రభువువారితో మనవిచేయవలసిన సంగతులను దెలిసి యాయనను బంపివేసిరి. తరువాత వివాహము నిమిత్తము వచ్చిన బంధువు లెవరియూళ్ళకు వారుపోయిరి. ఆసభికుఁడును పెద్దాపురము చేరినతోడనే తన విషయమై రాజశేఖరుఁడుగారు చేసిన యాదరణమును ఆయనయొక్క యువకార స్మృతియును సాధువర్తనమును కృష్ణజగపతి మహారాజుగారితో మనవిచేసి, తన్నాయన ప్రభువు వారితో చెప్పవేఁడుకొనిన మాటలను విన్నవించెను.

రాజశేఖరుఁడుగారు భాగ్యవంతులై మరల గ్రామమునకు వచ్చియున్నారని విన్న కొన్నిదినములకు నారాయణమూర్తి యొక్క నాఁడువచ్చిఁ రహస్యముగా రాజశేఖరుఁడుగారితో తానను దామో దరయ్యయుఁ బ్రాణ్మిత్రులుగా నుండుటయు దామోదరయ్యయొక్క మరణానంతరమున తానాతిని చెలికాఁడను ద్వేషము చేత జనులు తనయింటఁగల సొత్తంతయు దోపించుటయు అందువలనఁ దానిప్పుడు