పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పదు నేనవ ప్రకరణము

<poem>మాటలు చెప్పువారి నందఱినిమిత్రులని నమ్మకయు మెలఁగఁ జొచ్చిరి. యోగి వెనుకచేసిన కుతంత్రమువలన నాతనికి యోగులను వారియం డెల్లను కేవల జఠరపూరకులను నబిప్రాయమును మంత్రముల యందును సువరకరణాది విధ్యలయందును దృఢమైన యవి శాసమును గలిగెను. రుక్మిణికివెనుక పట్టినదయ్యములు భూతవైధ్యము శకునములు మొదలగు వానివల నెల్లవారికిని వానియందులి నమ్మకము చెడుటంజేసి మఱియెప్పుడునువారి యింట నెవ్వరికిని గ్రహబాధా కానిప్రయోగ లకణము కాని దేవత లావహించుటగాని కలుగ లేదు. కుటుంబములోని వారి జాతకములును పెట్టిన ముహూర్తములును పలుమాఱు విరుద్ధఫలములు నిచ్చుచు వచ్చినందున, రాజశేఖరుఁడు గారికిని తత్సంతతివారికిని జ్యోతిషమందున నహిత మప నమ్మకము కలిగెను .

<poem>రుక్మిణి వివాహకాలమున చేసిన ధర్మములకెై ఋణముల వలని నషముల ననుభవించి యుండుటం జేసి రాజశేఖరుఁడుగారిఁక నెప్పుడును పరులకు ఋణపడకూడ దని నిశ్చయము చేసికొనిరి.

<poem> ఆంతటినుండియు రాజశేఖరుఁడుగారు మితవ్వయమునే చేయుచు వ్యర్ధదంభమునకై ధనము పాడుచేసి కోక, తమ కీశరుఁడు దయచేసినదానితోడనే తృప్తినొందుచు, కలకొలఁదిని బీద సాదలకు దానధర్మము చేయుచు,కలలోసహితము సత్యమును భూత దయయును తప్పక, "ధర్మోజయతీ" యను నీతివాక్యమును సదా హృదయమునందుంచుకొని సమస్తకార్యములయందును నీతిపధమును నీఁగకాంతయు దాటక ఋజువుగాఁబ్రసర్తించుచు మంచివాఁడని లోకమునఁ బ్రసిద్ధికెక్కి, పెక్కండు మనుమలను మనుమరాండ్రనెత్తి సిరియు సంపదయుఁగలిగి చిరకాలము నుభింపుచుండిరి ఆయన