పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

రాజశేఖర చరిత్రము
చేసి యారెండు పక్షములవారిని సమాధానపరచి, ఆమె యొద్ద తాము రెండువందల రూపాయలను స్వీకరించి యామెకు పుట్టువెండ్రుకలు తీసి వేయించి, ఆ కేశఖండన మహోత్సవమయిన మరునాఁడే యామె యింట భిక్షచేసి ముందుగా తాము హసోదకము పుచ్చుకొని తరువాత బ్రాహ్మణుల కందరకును నిప్పించి నాటితో నామె వెలి తీర్చివేసిరి.
రాజ---- ఆ స్వాములవారు పూర్వాశ్రమములోనేగ్రామనివాసులు?
సుబ్ర---- వారి నివాసస్థలము ముంగొండయగ్రహారము. ఆయనకు నలుగురు కొమాళ్ళున్నారు. ఆశ్రమమును స్వీకరించిన తరువాతనే స్వాములవారు మునుపు మాన్యములమీఁద నున్న ఋణములను దీర్చివేసి నలుగురు కొమ్మాళ్ళుకును వివాహములు చేసి కోడండ్ర కొక్కొకరికి రెండేసివందల రూపాయల యాభరణము లుంచినారు.ఇప్పుడీస్వాములవారిపేరు శ్రీ చిదానందశంకర భారతిస్వామి యఁట.
అని మాటాడుకొనుచు వారు రాజసభకుఁ పోవునప్పటికి రాజుగారు కొలువుగూటమునకు విజయంచేసి సింహాసనాభష్టితులై కూరుచుండియుండి మంత్రి తెచ్చియిచ్చిన విజ్నానపత్రికలను జదివి చూచుకొని పిఠాపురమునుండి వచ్చిన దొంగలను తమయెదుట బెట్టుటఁకు తరవుచేసిరి.ఈలోపల రాజశేఖరుఁడుగారును సుబ్రాహ్మణ్యమును నృసింహస్వామియు సభ ప్రవేశించి తగినచోటులఁ గూరుచుండిరి; రాజభటులును దొంగలునుగొనివచ్చి ప్రభువునెదుర నిలువఁబెట్టి తాము ప్రక్కలను కత్తులుచూసుకొని నిలుచుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయఁ జూచి ' యీదొంగలను పట్టుకొన్నవారెవ ' రని ప్రశ్న వేసిరి. సుబ్రాహ్మణ్యము లేచి నిలువఁ బడి ' నేను ' అని మనవిచేసెను. తోడనే ప్రభువువారు రాజశేఖఁరుడు గారివంక దృష్టిబరపి "యీతడు