పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

207

పదునాల్గవ ప్రకరణము
పట్టుశాటి కట్టుకొని స్వాములవా రెప్పుడును కుంకుమముతో పీఠపూజ చేయుచుదురు. ఆ పీఠములో స్త్రీ యంత్రముకూడ నున్నదనియు, వారు పూర్వాశ్రమమునందు సహితము స్త్రీ విద్యోపాసకులే యనియు విన్నాఁడను. అది సత్యమౌనో కాదో కాని వారిప్పుడు మాత్రము రాత్రులు చీఁకటిలో ముసుఁగు వేసుకొని యొక మనుష్యుని వెంటబెట్టుకొని ప్రత్యక్ష మయిన స్త్రీయుపాసనము చేయుటకె బయలుదేరు చుందురని చూచినవారే యొకరు నాతో రహస్యముగాఁజెప్పినారు.

మొన్న నీనడుమ నొక శిష్యుఁడెత్తుకొని పారిపోయినది గాక, యింకను పీఠమునకు రెండువేల రూపాయల వెండిసామగ్రి ఉన్నది.

రాజ---- వారు గ్రామములో నున్న కాలములో మతసాంకర్య నివారణముగాని మతవ్యాసనముగాని చేయుట కేమయిన బ్రయత్నము చేసినారా?
సుబ్ర---- అట్టిపను లేమియు చేయలేదుగాని యొక్క ఘనకార్యమును మాత్రము చేసినారు. ఆ గ్రామములో ధనవంతురాలయిన యొక బాలవిధవ యున్నది. ఆమెయేమో భ్రూణహత్య చేసినదని గ్రామము లోని సభావతులు కొందరామెను జాతినుండి బహిష్కారముచేసిరి. తరువాత నామెకు జగన్నాధసతర్పణము చేసినప్పుడు ధనము కాశపడి కొందరు బ్రాహ్మణులు భోజనములు చేసిరి. అందుచేత నక్కడకు భోజనములకు వెళ్ళినవారందరు నొకకక్షగాను, వెళ్ళనివారందరు నొకకక్షగాను నేర్పడిరి. లోకమున కెల్లను ధనమె మూలమగుటచేతను, ఆమె లక్షవత్తులనోము మొదలయిన వ్రతములుచేసి యప్పుడప్పుడు బ్రాహ్మణసమారాధనలు చేయుచు వచ్చుచుండుటచేతను, క్రమక్రమముగా సంఖ్యయం దామె పక్షమువారే బలపడి మొదట వెలివేసిన వారికే యిప్పుడు వెలిగా నుండెను. తరువాత స్వాములవారు విజయం