పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

209 పదునాల్గవ ప్రకరణము

మీకొమారుఁడుకాఁడా" అని యడిగి "చిత్తమని " యాయన బదు

లుచెప్పగా విని యెడమప్రక్కను గూరుచున్నవా రెవరని మరల నడిగిరి.రాజశేఖరుఁడుగారు చేతులు కట్టుకొని నిలుచుండి యీతఁడు తమ యల్లుఁడగుటయు గిట్టనివాఁడొకడు ఆతడు వారణాసీపుర ముననున్న కాలములో వచ్చి మృతుఁ డయ్యెనని వట్టిప్రవాదము వేయుటయు రుక్మిణి దొంగలచేత దెబ్బతిని మూర్చపోయియుండఁగా తన్నందఱును దిగవిడచిపో యిన తరువాత మూర్చ తేఱి పురుషవేషము వేసికొని సీతనెత్తుకొనిపోయిన గ్రామమునుండి చెల్లెలితోఁ గూడ వచ్చుటయు సమగ్రమముగా విన్నవించిరి .రాజుగారు హర్షమును దెలుపుచు శిరఃకంపముచేసి , కొంతసే పూరకుండి యావంకఁదిరిగి మీరేమి చెప్పుకొనెదా రని యడిగిరి.

నీలా----సర్వమును దెలిసిన దేవరవారికడ మేము వేఱుగ చెప్పుకోవలసిన దేముండను ? మేము నిరపధులమని చెప్పుఁబోము. దేవరవారు దయాపూర్ణ హృదయులు గనుక ఆదయారసమును మామీఁదఁ బ్రసరింపజేయ దీనత్వముతో వేడుకొనుచున్నాము.

కృష్ణ---నీది యేదేశము? చిన్నప్పటినుండియు.నీ వెక్కడ నున్నావు? నీ చరిత్రమేమి? నీలా----నాచరిత్రము మిక్కిలి యద్భుతమయినది.నేను దానిని చెప్పుకొనుటకు సిగ్గుపడవలసియన్నను దేవరయంతటివా రడుగువచున్నారు గాన దాఁచక విన్నవించెదను.ఈవఱకు నేను జేసిన దుష్కృత్యము లన్నిటిని లీఱికగలిగి యున్నప్పుడెల్ల నాకు స్మరణఁకుదెచ్చి నామనస్సు పలువిధముల నన్ను బాధించుచున్నది; రాత్రులు నన్ను నిద్రపోనియదు ;కలలోసహితము నేను జేసిన ఘోరకృత్యములకు రాజభటులు నన్ను ఁగొనిపోయి శిక్షించుచున్నట్టు 27