పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము

సుబ్రాహ్మణ్యముపిఠాపురమునుండివచ్చితండ్రినిదర్శించుట శ్రీశంకరాచార్యులవారియాగమనమునీలాద్రిరాజుసభలోతన వృత్తాంతమునుజెప్పుట.కృష్ణజగపతిమహారాజులుగారురాజులుగారురాజశేఖ రుఁడుగారిమాన్యములనువిడిపించీచ్చుట

సుబ్రహ్మణ్యముపిఠాపురమునుండి బయలుదేఱి,సొమ్ముతోనీలాద్రిరాజువెంటవచ్చుచున్నరాజభటులతోఁగలినభీమవరమునకువచ్చి,అక్కడినుండివారినిపెద్దాపురముపొమ్మనితానొక్కఁడునుతిన్నగానింటికిఁబోయెను.అప్పుడురాజశేఖరుఁడుగారుభోజనమునకు లేవఁబోవుచుండిరి.కొమారుఁడువీధిగుమ్మములోనుండిలోపల నడుగుపుట్టగానేచూచి,అబ్బాయివచ్చివాఁడనిరాజశేఖరుఁడుగారుకేకవేసిరి.ఆకేకతోనే'యేడీ యేడీ' యనిలోపలి వారందఱును నొక్కసారిగా పరుగెత్తుకొనివచ్చిరి. అందఱికంటెను ముందుగాసీత పరుగెత్తుకొనుచచ్చి అన్నగారిని కౌఁగలించుకొనెను. ఇంతలో మాణిక్యాంబ రాఁగాసుబ్రహ్మణ్యయామెనుకౌఁగలించుకొని, తరువాత తల్లిదండ్రుల కిద్దఱికినినమస్కారము చేసి వారిచేత నాశీర్వాదములను బొందెను. ఈనడు మనృసింహస్వామివచ్చి సుబ్రహ్మణ్యముయొక్క చేయిపుట్టుకొనీ 'బావా!' యనిపిలువగానే యతఁడతనిమొగము వంక దిరిగిచూచి మాటరాక యద్భుతపడి చూడసాగెను. అట్లొకనిమిషముచూచి మఱఁది నాలింగనముచేసీ యెప్పుడువచ్చినా' వనియడిగి, మగఁడు జీవించియున్నాఁడన్న వార్తవిని సంతోషించుటకు రుక్మిణికి ఋణము లేకపోయెను గదాయని కన్నులనీరుపెట్టుకొనెను. అంతట రుక్మిణి బ్రతికి యుండుటయు దొంగలుకొట్టిన రాత్రినుండియు నామెకు సంభవించిన యాపదలును