పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పదమూడవ ప్రకరణము
ఆయనచేయి పట్టుకొనెను. ఆయన బ్రత్యక్షముగాఁ జూ మును నమ్మక మరలమరల దేహమును పట్టి చూచి, పాదములు చలము నైపునకు తిరిసెయుండక తిన్నగానే యుండటవలన మాయకాగార నిశ్చయించి యాతనిని లోపలికిఁ దీసికొనివచ్చి భార్యతో మన నృసింహస్వామియే వచ్చినాఁడని చెప్పి కాళ్ళుకడుకో నీళ్ళిమ్మని కొందరి పెట్టెను. ఆమెయు దీపము దగ్గరగా దీసికొనవచ్చి మొగము పాఱఁజూచి ' నాయనా ' యని కౌగలించుకొని కన్నీరునించెను. ఆయుద్రేకమంతయు నడఁగిన మీఁదట, నృసింహస్వామిలేచి కాళ్ళు కడుగుకొని భోజనము చేయుచు తాను కాశీయాత్ర వెళ్ళుటయు దారిలో తనమిత్రుడు తన్ను విడిచి వచ్చుటయు మొదలుగాఁగల సంగతి నీప్రకారముగా జెప్ప నారంభిచెను.
నాకు చిరకాలమునుండి కాశీయాత్ర చేసిరావలెనని మనసులో కోరిక యుండెను గాని తగినతోడు లేకపోవుటచేత నాకది దుర్లభమని యాతలఁపు విడిచి పెట్టితిని.ఇట్లుండఁగా నొకనాఁడు చామర్తివారి చిన్నవాడు శేషాచలము నాయొద్దకువచ్చి యెవ్వరితోను జెప్పనని నాచేతఁదనచేతిలో చేయివేయించుకొని రహస్యముగా దనకు హిమవత్పర్వతము దగ్గర తప్పస్సుచేసి స్వర్ణవిద్యను గ్రహింపవలెనని కోరిక గలదనియు,నేనుకూడ వచ్చినపక్షమున తనతో దీసికొనివెళ్ళి యావిద్య నుపదేశించెదననియు,మనమిద్దఱమును బంగారముచేయు యోగము గ్రహించిన మీఁదట మరల నింటికివచ్చి కావలసినంత బంగారమును జేసుకొని కోటీశ్వరులము కావచ్చుననియు చెప్పెను. ఆ మాటల మీఁద మనస్సులో నాకును మిక్కిలి యాశపుట్టి, తప్పక బయలుదేరి సాధ్యమయినయెడల కాశీయాత్రకూడ చేసికొనిరావలెనని నిశ్చయించితిని. తరువాత మేమిద్దర