ఈ పుట ఆమోదించబడ్డది
205
- పదునాల్గవ ప్రకరణము
- తుదకు సుఖముగా నిల్లుచేరుటయుఁ జెప్పి, రాజశేఖరుఁడుగారు కొమారుని నూరార్పఁజెచ్చిరి. ఆ మాటలు ముగియక మునుపే సంతోషము పట్టలేక సుబ్రహ్మణ్యము లోపలికిఁబోయి రుక్మిణి నాలింగనము చేసుకొని యామె తన్నుఁ జూచి కంటఁ గడిపెట్టుకోఁగా నూరడిచెను.ఈవలకు వచ్చిన తరువాత నృసింహస్వామి తన కధను సొంతముగా వినిపించెను. పిమ్మట నందరును స్నానములుచేసి యుతికిన మడుగుదోవతలు కట్టుకొని భోజనములకడఁ గూరునుండిరి. భోజనసమయమున సుబ్రహ్మణ్యము పిఠాపురములో రాజుగారిలోపల దొంగలు పడులయు దొంగలను తాను పట్టుకొన్న రీతియు దొరికిన సోత్తులో బైరాగి యెత్తుకొని పోయిన తమ సొమ్ముకూడఁ గనబడుటయు విమర్శన నిమిత్తమయి క్రిష్ణజగపతి మహారాజుగారి యొద్దకు బంపబడిన దొంగలతోఁ గూడఁ దన్నిచ్చటకు బంపుటయు జెప్పి, యిక్కడనుండి వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము నిచ్చెదమని పిఠాపురపు రాజుగారు వాగ్దానము చేసియున్నారని చెప్పెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు " మన యింటికి రాకపోకలు చేయుచు వచ్చిన రామరాజే క్రిష్ణజగపతిమహారాజుగా" రని చెప్పి, ఆయన యద్భతచర్యలను తమకుఁ జేసిన యుపకారమును నామూలాగ్రముగా వినిపించి యాయనను పొగడిరి. యింతలో భోజనము లైనందున లేచి చేతులు కడుగుకొని తాంబూలములు వేసికొని తెల్లబట్టలు కట్టుకొని రాజశేఖరుఁడుగారును సుబ్రహ్మణ్యమును బయలుదేరి నృసింహస్వామి వెంటఁ బెట్టుకొని పెద్దాపురమునకుఁ బ్రయాణము పోయిరి.
- వారు పెద్దాపురము చేరి రాజవీధిని ప్రవేశింపగానే యావీధినే దూరమున నొక పల్లకియును దానిముందొక యేనుగును రెండు గుర్రములును బండిమీఁద నొక భేరియును మఱికొన్ని వాద్యములును వెను