పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

రాజశెఖర చరిత్రము

<poem>పక్కల గ్రామమముల అందుకుడ అతని ప్రసిద్ది వ్యాపించినది. ఎవ్వరి యింట నెవ్వరికి కొంచెము జ్వరము వచ్చినను మానాయనను పిలిచి తీర్దము మిప్పించి చుండిరి; ఎవ్వరికి కొంచెము గాలి పొకిందన్నను మానాయననె పిలుచుకొని పోవుచుండిరి;ఎవ్వరు కొంచెము జడిసికొన్నను ,మా నాయన చెతనే విభూతి పెత్తించు చుండిరి.వేయేల చుత్తు పక్కల ఏగ్రామమున ఎవ్వరికి జబ్బు వచ్చినను మా నాయనను పిలువని స్తలము లేదు .ఈ ప్రకరము జరుగు చుందుట చేత నెల్లవరును తమ వస్తువులను మా ఇంటికి దెచ్చి భక్తి పూర్వకముగా సమర్పించుచుండిరి.;ఎవ్వరి ఇంట ఏ శుభకార్యము జరిగినను ముంధు కట్నము మా నాయనది గానే వుండును.

ఈ విదముగా కొంతకాలము జరిగిన పిమ్మట ఒకనాడు.ప్రాతకాలమున మా నాయనవీధిలొ నడుచుచు ,ఒక యీడిగవాని వాకిట కాయల గెలలతో నిండియున్న ఒక కొబ్బరి చెట్టును చుచి ఆయింటి వానిని పిలిచి తనకు నాలుగు లేత బొండములను పంపమని అడిగెను.వాడు కొంచెము పొగరు బోతు కనుక సొమ్ములిచినచొ కాయలు ఇచ్చెదనని అనెను. అందు మీద మా నాయన కోపద్రుస్టితో వానివంక కోపంగజూచి కాయలనియ్యమని గర్దించెను. 'నేనియ్యను నన్నెర్రపారిచూచి యెమిచెసెదవొ చూత 'మని వడును వెనుక తీయక గట్టిగ చెప్పెను.రేపిపటికి నీ చెట్టెమగునొ చూచుకొమ్మని తలయాచుచు మా తండ్రి ఇంతికి పొయెను. దయ్యాలుపెట్టి చంపినప్పటిమాట చూచుకొండమని వానిని వాడును లొపలకి నడచెను. ఆ రత్రి రెండుజముల వేల మాతండ్రి గాడ నిద్రలో వున్న నన్ను లేపి నాయుత్తరీయము చెంగున గిద్దెడు బియ్యము మూటగట్తి కడుగు <poem></