==== పండ్రెండవ ప్రకారనము
లుండి వైద్యము చేయుంచుకొని నిమ్మళించిన తరువాత బయలు దేరి చుట్టుపక్కల గ్రామములొ తిరుగుచు పూటకూటీ ఇడ్లలొ భోజనం చెయుచు పదిహెను దినముల క్రిందట జగ్గంపెట చెరితిరి.ఆ గ్రామము కరనము ముసలి వాడును పుత్ర సంతానము లేనివడను గనుక నన్నుజూచి ముచ్ఛటపడి తన పనికి నెను సాయంగ వుందునని యెంచు నన్ను దయొద్దనె యాదరించుచు నా ప్రవర్తనకు మిక్కిలి సంతొషించి తనకున్న ఒక్క కుమర్తెను నాకిచి వివాహము చేసి ఇల్లరికము వుంచుకొవలెనను నుద్దేసముతొ నా కుల ఘొత్రము నడీగి తెలుసుకొనెను.నేనక్కడ సుబ్బరయుడు అనే పెరున మిక్కిలి నమ్మకముగావుండి ,మీరు విద్య చెప్పించిన మహిమ చెత లెక్కలు మొదలైనవి వ్రాయుటలొ తోడపడుచుండి ,నాకు వెంకటెస్వరులు మొక్కు చేత మా వారు తల పెంచు కొనునట్టు చెసినరనియు ,ఈ వ్రత సమాప్తి అగువరకు తలయాంటు కొగూడదనియు, చెప్పి ఆ వ్రతమునకు భంగము కలగకుండ కాపాడెద మని వారి చేత అనిపించుకొని పురుష వేషము బయల పడకుండ గడుపు కొనుచు వచ్ఛ్హితిని . అట్లుండగ ఒకనాడు మధ్యనము సీతను ఎత్తుకొఛ్ఛి యెవ్వరొ ఇద్దరు మనుఘ్యులు భొజనము పెట్టించుటకై నే నున్న ఇంటికి తీసుకువొచ్చిరి. అప్పుడు మనము దాహము తీర్చి బ్రతికించిన రాజు వచ్ఛి వాన్ని కొట్టి సాగనంపెను. అంతట ఆఇంటి వారివద్ద సెలవు పుచ్ఛుకొని నెనునూ రాజుగారిని దీసుకొని వచ్చితిమి. మీ అంతట మీరందరును నన్నానవాలు పట్టి కనుగొనువరకు నేను రుక్మిణి అని మితో ఎవ్వరితొ చెప్పకుండ వుండ వలెనని మార్గము పొడుగుననూ తలచికొని వచితిగనీ, అమ్మను జూచిన తోడ మనసు పట్టలేక లోపలినుండి దు ఖము పొంగివచ్ఛి కౌగిలించుకొని నా సంగతి చెప్పివేసితిని.