పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

తరువాత మీరెవ్వరును లేకపోవుట చూచి బ్రతికి యున్న యెడల మీరు నన్నొంటిగ దిగ విడిచిపో నను నమ్మక పోయిన మీ అందరును దొంగల చేత మరణము నొంది యందు రనియు ఘాతుక మృగము లేవియే మీ దెహముల నిడ్చుకొనిపోయి యుండవచ్ఛ్హు ననియు దలపొసి చూడజుట్టమును దైవమును గానక చావ నిశ్చయించుకొని ,మరల నింతలొ ఆత్మహత్య దోష మనబుద్ది యొకటి పుట్టుట;చేత కొంత జంకి మిలో నెవరయిన బ్రతికి వుందవచ్ఛు ననియు నొకవేళ మిమ్మాందరను మరల జూచు భాగ్యము కలిగినను కలుగవచు ననియు నూహచేసి మరణ ప్రయత్నమును మానుకొని , లేచి నాలుగడుగులు నడచితిని .అక్కడ నెత్తుట దోగియున్న శిరస్సొకటియు దాబి ప్రక్కను బట్టలమూటయు గనబడగా, అంతటి ఆపదసహితము దుర్వార మయిన క్సుద్బధకు సహింపలేక తినుట కందులో నేమయిన దొరకవచ్ఛునని ఆ ముటను విప్పి చూచితిరి.అందు పురుఘులు మ్మత్రమెయ్ తగిలించు కొవలసిన వస్త్రలు మాత్రమె వున్నవి. వానిని చుచిన తోడనే చక్కని స్త్రిలు నిజ వేషములతొ నొంటరిగ దిరుగుత క్షెమకరము కాదుకబట్టి పురుఘ వేషము వేసుకొని యేదొనొక గ్రామము చేరవలె ననునలోచన తొచి ఆ వస్త్రమును గట్టుకొని యంగిని తొడుగుకొని పురుఘ వేషమును దరించి ,నా పూర్వ బట్టలను మిగిలిన్ బట్టలతొ జేర్చి మూటగట్టి నా శరీరమును నన్ను నగలను తీసి చెంగున ముడి వేసుకొని బయలు దేరి ,యొక కాలి మార్గమున నడచి తెల్లవరెటప్పటకి ఒక గ్రామం జేరితిరి. ఆ గ్రామములొ ఆపూట కుండి నగలనమ్మి వేసి రొక్కలను జేర్చుకొని తలమిద దెబ్బచేత భాదపడుచునే చెరువ గ్రామమునకు బొయి ఇక్కడ కొన్ని దినము