పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పండ్రెండవప్రకరణము

చనము జేయించిరనియు జెప్పి, తన్ను విడిపించి నక్రమమును వివరించి కొంతసేపు సృపుని సద్గుణ నిర్ణయమును జేసెను. మాణిక్యాంబ రామరాజు దేశాధీశుండని విని అశ్చర్యపడి. ఆయన యొక్క గర్వరాహిత్యమును పరోపకార శీలతను బహు భంగులు మెచ్చుకొనెను.

ఇట్లు మాటాడు చుండంగానేసుబ్బరాయుండు వచ్చి రాజశేఖరుండుగారి కాళ్ళమిదపడినేను "రుక్మిణి" ననిచెప్పెను. ఆయన సంతోషముచేత కొంతసేపు మాటాదలేక, తుదుకు హృదయము పదిలపఱచుకొని లేచిపెద్దకుమమార్తె నాలింగముచేసుకొనెను. అప్పుడు చచ్చిపోయినదను కొనుచున్న కూతురు లేచివచ్చుట చేతనాదంపతు లకిరుపురుకును గలిగినసంతోషమింతంతయని చెప్పశక్యముకాదు; ఆసమయమున సీతకుగలిగిన సంతోషమును పట్టశక్యముకాకపోయెవను. అయూద్రేకము కొంత నిమ్మలపడినమీదట, ఆవధూవరులు తమ్మెడబాదినదిమొదలు కొనినేంత వఱకును జరిగిన వృత్తాంతమును సనిస్తరముగాజెప్పుమని రుక్మిణినడిగిరి. రుక్మిణినడిగిరి రుక్మిణి మూప్రకారముగా వినిపింప నారంభించెను.

మనలను దొంగలు కొట్టిన వాడు రాత్రిపిండి డియారంబోసినట్లు తెల్లగవెన్నెల కాయుచుండగా నాకుమెలకు వవచ్చిచూతును గదా కటిక నేలను మహరణ్యమధ్యమునబడి యుంటిని నలుదిక్కుల నెంతవఱకు జూచిన నెందునెవ్వరును గనంబడలేదు . ఎక్కడను మనుష్య సంచారమును కనబడులేధు గాని మృగముల సంచారముల యొక్కకూతలు మాత్రము చెవిలొ వినపడసాగేను. ఇంతలొ నొక వ్యాగ్రమము నాధగ్గరనుండియే పోయినధెకాని నన్నుచూడక చేరువు నున్నయొక మనిష్యుని మొండెము ఇడ్చుకు పొయి తొలగి పొయెను. దానిని చుచిన తోడనే నాదెహము నాకు స్వాధినము కాలేధు. కొంత తెలివి వచ్చిన
.