- రాజశేఖరచరిత్రము
సహీతము సగము శిక్ష తక్కువ చేసిరి, ఈకావ్యములన్నింటిని జక్కబెట్టుకొని శ్రీకృష్ణజగపతి మహారజుల వారు భద్రబాహుదలయ వందిమాగధులు బిరుదుపద్యములు చదివికొనియాడ, భేరిమృనంగాది వాద్యములు బోరుకలుగ, చతురంగ బలసమేతలయి తమరాజధానికి విజయంచేసిరి.
రాజశేఖరుండు గారింటికి వెళ్ళునప్పటికి మాణిక్యాంబ పడవంటింటి గోడకు జేరగిలంబడి గూరుచుండి తలవంచుకొని మర్పరాయుని తొనేమోచెప్పు చుండెను. రాజశేఖరుండు గారు గుమ్మము వద్దకు వెళ్ళి, ఆ చిన్నవాని ముఖలక్షనములును పలుకబడియు రుక్మిణిని పోలియున్నందున నాశ్చర్యపడి చూచి పురుషుడయివున్నందున ఎమని నిశ్చయించుటకును తోచక విబ్రాంతితో నాతని మొగము వంక నేఱెప్ప వేయక చూచుచు లోపలిరాక యచ్చటనే నిలుచుండిరి. ఇంతలో సీత గుమ్మము లోనుండి తొంగిచూచి, "అమ్మా!నాన్నగారు వచ్చినా" రని కేకవేసి వెళ్ళి తండ్రిని కౌగిలించుకొనెను.
అంతట మాణిక్యాంబ పరమానంద భరితురాలయి వేంటనే లేచి వెళ్లి కాళ్ళు కడుగుకొన నీళ్ళు తెచ్చియిచ్చిపాదముల తడి తన పయిట చెఱంగుతో నొత్తి కూరుచుండుటకయి గోడదరిని పీటవేసెను. రాజశేఖరుండుగారు పీటమిద గూరుచుండి సీతనుముద్దాడి తొడ మీద కూర్చుండబెట్టుకొనెను. అప్పుడు మాణిక్యాంబ సీతను దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజు మఱియొకరను వదిలించి తెచ్చుటయు జెప్పెను. రాజశేఖరుండు గారు రామరాజు పెద్దాపురాధివాధులయిన కృష్ణజగపతిమహారాజులనియు, ఆయన ప్రజలక్షేమము కనుగొనుటక యియట్టిమాఱు వేషములతో సంచరించు చుందురనియు, రామరాజను పేరునవచ్చి మనకు బహూపకారములను జేసి తుదకు కారాబంధవిమో