పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సేవించుకొని, మాసము క్రిందట పాదగయను దర్సించుటకయి వచ్చి యప్పటినుండియు నిక్కడనే యున్నాము. మీతండ్రిగారికి మాయెడల గురుభావము. మేమక్కడున్న దినములలో మీతండ్రిగా రెప్పుడును మాయొద్దనే యుండెడివారు.

సుబ్ర-సంవత్సరము క్రిందట మిమ్ము జూచినట్లు నాకు జ్ఞాపకములేదు. మీరెక్కడ బనచేసినారు ?\

నీలా-మీకు జ్ఞాపకము లేదుగాని మాకు చక్కగా జ్ఞాపకమున్నది. మీకిద్దఱు చెల్లెం డ్రుండవలెను వారు బాగున్నారా?
                                     
సుబ్ర-పెద్ద చెల్లెలు రుక్మిణి చనిపోయినది. చిన్న చెల్లెలు బాగున్నది.

నీలా-మీరు నాసంగతి బాగుగా నెఱుగరు. విజయనగరపు రాజుగారు మా మేనమామకుమాళ్లు మొగలితుఱ్రురాజుగారి కిచ్చినది మాసవతి మేనకోడలు.

సుబ్ర-నేనిప్పుడు సభకుబోవుచున్నాను. మఱియొకప్పుడు సావకాశముగా దర్శనముచేసుకొని మాటాడెదను ఇప్పటికి సెలవిచ్చెదరా ?

అని సెలవుపుచ్చుకొని సుబ్రహ్మణ్యము రాజుగారి కోసం కూటమునకు బోయెను. అతడు ప్రతి దినమును తప్పక సభకు బోవుచు, ఉద్యోగస్ధులలో నెల్ల స్నేహముచేసి, అన్నివిధముల పనులను నేర్చుకొనెను. అక్కడి కొలువుడు కాండ్రందఱును ఏకాగితము వ్రాయవలసి వచ్చినను సుబ్రహ్మణ్యమునే పిలిచి వ్రాయించు చుందురు. ఏలెక్క కట్టవలసివచ్చినను సుబ్రహ్మణ్యము కట్టించుచుందురు. అందుచేత నతనికిజీతమేమియు లేకపోయినను జీతగాండ్ర కంటెపనిమాత్ర మెక్కువ గలిగి యుండెను. ఈప్రకారముగా నంద