పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

దయవచ్చునట్లుగా నెవ్వరేవని చెప్పినను జేయుచు వచ్చినందున వారందఱును గలసి 'యీచిన్నవాడు బహు కాలమునుండి యాశ్రయించి సంస్థానము కనిపెట్టియున్నాడ'ని రాజు గారితో మనవి చేసిరి. దానిమీద రాజుగారు సమయము వచ్చినప్పుడును యుండవలసిన దనియు సెలవిచ్చిరి. ఈలోపల సుబ్రహ్మణ్యమొకనాడు వెళ్ళి మరల శీలాద్రిరాజు గారి దర్శనము చేసెను.

నీలా-ఏమయ్యా?సుబ్రహ్మణ్యముగారూ! గ్రామములో విశేషము లేమి?
సుబ్ర-వింతలేమియు లేవు. ఉద్యోగమున కయి రాజుగారి ననుసరించుచున్నాను. ఇంకను పని కలిసి రాలేదు.
నీలా-మికింత యనుసరించుట యెందుకు? దూరదేశమునకు వెళ్ళగలరా? నిమిషములో విజయనగరపు మహారాజుగారివద్ద గొప్పపని చెప్పించెదము.ఆయన మాకు బినతల్లి కొమారుడు.
ఈ కడపటి వాక్యము పూర్వము మేనమామ కొమారుడని చెప్పిన దానికి విరుద్ధముగా నున్నందున,ఆతడబద్ధ మాడుచున్నాడనిననులో ననుకొనియు చెప్పినమాట మంచిదిగనుక కొంచెము నంతోవాని సుబ్రహ్మణ్యము మారువలుక కూరకుండెను.
నీలా-అనుమానించుచున్నారేమి? మితోడు మికుతప్పక గొప్పయుద్యోగము నిప్పించెదము.కాళహస్తి రాజుగారయిన రామవర్మగారికి మాకును సత్యంతమైత్రి;చిన్నప్పుడు వారును మేమును నొక్కబండిలో నెక్కినాము.ఈ సంగతి పరమరహస్యము. ఎవ్వరితోను జెప్పవద్దు.
సుబ్ర-చిత్తము ఇక్కడ పని కలిసిరానియెడల నవశ్యముగా వెళ్ళెదను.