ఉమాపతిగారి యింటనుండి రాజుగారికోటకు బోవుమార్గములో నొకగొప్ప మేడయుండెను. ఆమేడ ంద్దెకు బుచ్చుకొని నెలదినముల నుండి యందులో నొకరాజుగారు తన సేవకులతో గూడ కాపురముండి రెండుమూడు దినముల క్రిందట బ్రాహ్మణసంకర్పణ మొకటి చేసెన.సొమ్ములేకుండ వచ్చినప్పుడు పుష్కలముగా భుజించుట యెల్లవారికిని సహజగుణమే కాబట్టి, ఆయూరి బ్రాహ్మణోత్తములును నిత్యము నింటికడ ఘృతము నభిఘరించుకొనువారే యయ్యును నాడుమాత్రము చేరల కొలఁది నేయిత్రాగిరి. ఆసంతర్పణమువలన రాజుగారికీర్తి గ్రామమంతటను వ్యాపించెను. కాబట్టి ప్రతిదినము పలువురనిచ్చి యాయనను నాశ్రయించి పోవుచుండిరి. ఆయనపేరు నీలాద్రిరాజుగారు ఒక నాడు నీలాద్రిరాజుగారు భోజనముచేసి వీధి యరుగుమీద పచారుచేయుచు నిలువబడి, ఆత్రోవను రాజసభకు బోవుచున్న సుబ్రహ్మణ్యమును దూరమునుండిచూచి 'మాట' యని చేసైగజేసి పిలిచెను.
నీలా-పూర్వము మిమ్మెక్కడనో చూచినట్టున్నది. మీకావురపుగ్రామ మేది ?
సుబ్ర-నాజన్మభూమి ధవళేశ్వము,మాయింటిపేరు గోటేటివారు; నా పేరు సుబ్రహ్మణ్యము.
నీలా-అవును జ్ఞప్తికి వచ్చినది. మీరు రాజశేఖరుడుగారి కొమాళ్ళుకారా ? ఇప్పుడయన యెక్కడ నున్నారు ?
సుబ్ర-ఇక్కడనే భీమవరములో నున్నారు. మీరాయననెక్కడ నెఱుగుదురు ?
నీలా-ధవళేశ్వరములోనే చూచినాము. మేము సంవత్సము క్రిందట యాత్రార్ధమై బయలుదేఱి పదిదినములు ధవళేశ్వరములో నుండి గౌతమీస్నానమును చేసికొని, కోటిఫలి మొదలగు పుణ్యక్షేత్రములను
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/168
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది