పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ ప్రకరణము

శేఖరుఁడుగారు పెద్దాపురము వెళ్ళి రాలేదనియు వచ్చెడి సమయ మైనదిగనుక వచ్చినదాఁకవీధిలో నిలుచుండవలసిన దనియుఁ జెప్పి లోపలికిఁబోయెను. రాజశేఖరుఁడు గారు వేగిరము రాఁకపోఁగా కూలి వాఁడు తొందరపడుచుండుటను జూచి మాణిక్యాంబ వానకి తవ్వెడు బియ్యమును డబ్బును ఇచ్చి పంపివేసెను. ఆవెనుక సీత 'నాన్న గారు వచ్చుచున్నారేమో చూచివచ్చెద ' నని వీధి గుమ్మములోనికి వెళ్ళి ఇప్పుడువచ్చిన కూలివాఁడు కఱ్ఱదిగఁ బెట్టి పోయినాఁడని యొక చేతి కఱ్ఱను దెచ్చి వాఁడు మరల వచ్చి యడిగినప్పు డియ్యవచ్చనని పడక గదిలో మూలను బెట్టెను.

కొంత సేపటికి రాజశేఖరుఁడుగారు వచ్చి భార్య రాజమహేంద్ర వరమునుండి యుత్తరము వచ్చిన దని చెప్పి చేతికియ్యఁగానే దీపమువెకుతురునకుఁబోయిసగము చదివి చేతులు పడఁకఁగా జాబును క్రిందపడవయించి కన్నులనీరుపెట్టుకొని నారంభించిరి. జాబులో నేమి విషయములున్నవో వినవలెనని చేరువను నిలువఁబడిఉయున్న మాణిక్యాంబ మగనిచేష్టలు చూచి తొందరపడి యేమియు తోఁచక ఖేదపడియెద రేమని యడిగెను. ఆతఁడు గద్గదస్వరముతో మన రామమూర్తిని శూచి జాడ్యముచేత నిన్న మధ్యాహ్నము కాలముచేసినాఁడని చెప్పెను. అంత వారిద్దరును గొంతసేపు వచారమును పొందిరి.

ఆమఱునాఁడు ప్రాతఃకాలముననే రాజశేఖరుఁడుగారు బయలు దేఱి శోభ నాద్రిగారు యింటికిఁబోయి తన పినతండ్రి కొమారుఁడయిన రామమూర్తి గారిమరణమువలన సంభవించిన దురవస్ధనుజెప్పి ముహూర్త మశుచిదినములలోవచ్చుతచేత వివాహకార్యమునను సంభవించిన యాలశ్యమునకును నష్టమునకు కొంత చింతపడి పెండ్లి కుమారుని వారు తరలి రాకుండ వెంటనే వర్తమానము చేయుఁడని