పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

తరువాత వారు మఱియొకలాగునఁ జెప్పెదరా? చేసికొనియెన మని జాబువ్రాసిపంపివారు" అని యొక తాటాగుచుట్తను చేతి కిచ్చెను. దానిని చదువుకొని రాజశేఖరుఁడుగారు పరమానంద భరితులయిరి. అప్పుడే రాజుగారు సుబ్బారాయఁడుసిద్ధాంతిని పిలిపించి వివాహమునకు ముహూర్తము పెట్టుఁడని నియమించిరి. ఆతఁడు పంచాంగమును జూచి యాలోచించి వైశాఖ బహుళసప్తమి గురువారము రాత్రి 24 ఘటికల 3 విఘటికలమీఁదట పునర్వసు నక్షత్ర మేష లగ్నమును ముహూర్తము నుంచెను. వెటనే పెండ్లిపనులు చేయుట నారంభింపవలసినదని చెప్పి మీకు ఖర్చున కిబ్బందిగా నున్నయెడల ప్రస్తుత మీనూరు రూపాయలను పచ్చుకొని మీచేరిలో నున్నప్పుడు నెమ్మదిగాతిఅర్చవచ్చునని శోభనాద్రిరాజుగారు పెట్టెతీసి రూపాయాలను రాజశేఖరుఁడుగారిచేతిలోఁబెట్టి 'సొమిగా' అని సేవకునోక్కనింబిలిచి "నీవీ వారముదినములును పంతులుగారితోకూడి నుండి వారేపనిచెప్పినను చేయుచుండును". అని చెప్పి యొప్పగించెను. రాజ శేఖరుఁగారు వానినితేసికొని యింటికి బోయిరి.

ఆదినము మొదలుకొని ప్రతిదినమును రాజ శేఖరుఁగారు పెద్దాపురమునకు వెళ్లుచు కందులుమొదలిగాఁ గలన్ వానినెల్ల కొని తెచ్చి ఆదివారపుసంతలో కూరగాయలను దెప్పించచిరి. ఈవిధముగా పెండ్లిపనులను సాగంచుచు పంచమినాఁడు సీతను పెండ్లి కూఁతును గాజేసిరి. ఇఁక రేపు రాత్రి పెండ్లి యనగా షష్ఠినాఁడురాత్రి చేతిలో కఱ్ఱపట్టుకొని గొంగళి మునుగు పెట్టుకొని యొక కూలివాడు చీఁకటిలో వచ్చి రాజమహేంద్రవరమునుండి యుత్తరము తెచ్చినానని యొక తాటాకు చుట్టను సీతచేతికిచ్చెను. ఇంతలో మాణిక్యాంబ లోపలినుండి వచ్చి సీతచేతిలోని యుత్తరమును పుచ్చుకొని రాజ