పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖరచరిత్రము

కోరిరి. శోభనాద్రిరాజు గారును ఆయనను గొంచు మూరార్చి తక్షణమే పెద్దాపురమునకు మనుష్యునకు బంపిరి. పిమ్మట రాజశేఖరుఁడు గారింటికిఁబోయిరి.

తరువత వచ్చిన యాదివారమునాఁడు రాజశేఖరుఁడుగారు భోజనముచేసి కూరలకావళ్లను కూలివాండ్రచేత మోపించుకొని వానిని విక్రయించివేయుట కయి పెద్దాపురము సంతకుఁబోయి యొక యంగడి వానికి బేరమిచ్చి నిలువఁడిరి. ఆసమయముననొక గృహస్తు తలగుడ్డ చుట్టుకొని నిలుపుటంగీ తొడుకొని చేరవచ్చి "అన్నయ్యా! యీమయిల బొట్టెక్కడీది?" అని యడిగెను . రాజశేఖరుఁడుగా రాయన మొగము వంకఁజూచి ఱిచ్చపడి మాటతోఁచక యూగకుండిరి. మరల నాపెద్ద మనుష్యుఁడు "గంధముచుక్క పెట్టివారు మనకు మైల యెక్కడ నుండి నచ్చినది?అని యడిగెను.

రాజ-మన రుక్మిణిపోయిన వర్తమానము నిఅకు తెలియఁ జేసినాను గదా? మొన్న గురువారమునాడు సిఅతకు శివాహము ని శ్చయించుకొని పెండ్లి పనులన్నియుఁ దీర్చి సిద్ధముగా నుండగా బుధవారమునాఁడు రాత్రి మెవ్వఁడో దుర్మార్గుడొకఁడు నేను లేనిసమయమున వచ్చి నీవు పోయినట్టు వ్రాసియున్న జాబు నొకదానిని మీవదినె చేతి కిచ్చి పోయినాఁడు.

రామ-ఎవ్వఁడో పెండ్లి కార్యమునకు విఘ్నము కలిగింపవలెనని మూదుస్తంత్రమును చేసియుండును.

రాజ-గిట్టనివాఁడెవఁడోయీపన్నుగడ పన్నినాఁడు. ఇంటికి వచ్చి నీవదినెగారిని సీతను చూచి వత్తువుకాని.

రామ-నాకిప్పుడే రాజుగారిరో మాటాడి మరల నిమిషములమీఁద రాజమహేంద్రవరము వెళ్లవలసిన రాజకార్య మున్నది.నెల