పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

భయపడి యాఁతడిమఱి యేవషయమునందును స్తోత్రార్హుఁడు కానందున మంచి బట్టలను కట్టుకొనుటకు కొంత శ్లాఘించిరి. ఇట్లు తరుచుగా రాజశేఖరుఁడుగారు రాజస్ధానమునందు మెలఁగుచు వచ్చుటచేత వే ఱులాభమును పొందకపోయినను సభలో పదిమందిని నవ్వించు మార్గమును మాత్రము నేర్చుకొనిరి; కాఁబట్టి యప్పటి నుండియుఁ దా మొకమాటను చెప్పుచు ముందుగాఁదామే నవ్వదువచ్చిరి. అదిచూచి యందఱును నవ్వుచుండిరి. రాజుగారప్పుడప్పుడు ధర్మోపన్యాసముల సహితము చేయుచుందురు. లోకములోనెవ్వరెన్నిపాట్లుపడినను భోజనమునిమిత్తమే కాఁబట్టి, ఆవిషయమున నేమిచేసి ననుదోషములేదని వాదించుచుండిరి. ఈసిద్ధాంతము మనస్సుననాఁటియుండుట చేతనేకాఁబోలును రాజుగారుప్రతిదినమును లేచినదిమొదలుకొని పదిగడియలవఱకు ప్రాతర్భోజనమునకు వలయుసంభారములనిమిత్తమే ప్రయత్నము చేయుచుందురు; భోజనమయినది మొదలుకొని మధ్యాహ్నము ఫలహార మేమిదొరకునాయని చింతించుచుందురు; ఫలహారమయి నప్పటినుండియు రాత్రిభోజనమునకు వ్యంజనము లేవికలవని యాలోచించుచుందురు.

ఈ రాకపోకల చేత రాజశేఖరుఁడు గారికి రాజుగారివద్ద మిక్కిలి చనువుగలిగెను. ఆ సంగతినెఱిఁగి బ్రాహ్మణులు రాజశేఖరుఁడుగారి యింటికిఁ బోయి పలువిషయములు ముచ్చట్ంచుచు, వారిలోఁ గొందఱుసీత నెవ్వరికిచ్చి వివాహము చేయఁదలఁచినారని మాటవెంబడి నదుగుచుందురు;ఇప్పుడు చేతిలో డబ్బులేనందున, ఎవరికిచ్చి వివాహముచేయుటకు తలపెట్టుకోలేదని యాయన బదులు చెప్పుచుండును. ఒకనాఁడురాజశేఖరుఁడుగారు భోజనముచేసి కూరిచుండియుండఁగా బొమ్మగంటిసుబ్బారాయఁడను సిద్ధాంతి వచ్చిజ్యోతి