పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       పదవ ప్రకరణ

వెళ్ళఁబొవునపుడు రాజగారు రాజశేఖరుఁడు గారిని ‘అప్పుడప్పుడు వచ్చి దర్శన మిచ్చుచుండెదఱుకాదా‽’యని యడిగిరి, ‘ముఖ్యముగా వచ్చిదర్శనము చేసికొనుచుండెద’నని చేప్పి , ఆ యన నాటీకి పెద్దాపురము ప్రయాణము మానుకొని పదిగడియల ప్రొద్దెక్కువఱ కిల్లుచేరిరి.

నాఁడు మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుఁడు గారు ప్రాత్మకాలమునను సాయంకాలమున గూడఁబొయిశొభనద్రిరాజ గారి దర్శనము చేయుచుండిరి.ఆతాజగారును మిక్కిలి దయతోనాతని నదరించి మంచిమాటలతోసంతొషపేట్టుచుఁడిరి. ఆయన రాజకార్య విషయమైన పనిని జూచుచుండు నపుడు సహితము రాజశేఖరుఁడు గారువద్దనె యుండీ సంగతి కనుగొనుచుందురు; గ్రామాదులలొని ప్రజలు వ్రాసికొన్నావిజపన పత్రికలను కొలువుకాండ్రుచదువునపుడు వ్రాసినకొన్నామనవి కడపట రెండుమూడు పంక్తులలో మాత్రమే యున్నను బిరుదాపళిమాత్రము మొదటి రెండు పత్రముల లొను పూర్ణముగానిండియుండుట తెలిసికొని రాజుగరికి గ్రమములొని కాపులకనాబిరుదు వేళ్ళేవిశేషముగా నుండుట కానందించుచు వచ్చిరి రాజకార్యపుఁబని యైనతోడెనే రాజూగరు సబవారితోముచ్చత కారంబింతురు.ఆతఁడెంతసిపు చెప్పినను తన ప్రతాపమునే చెప్పుచుండును;ఆకధ లన్నియు నావఱకు పదిసారులు విన్నవే అయినను మొదటిసారి సవ్వినట్టె ప్రతిపర్యాయమును సభలోని వారందఱును నవ్వుచుందురు; ఆందులోఁ గొందఱు స్తొత్రపాఠములను జదిని రాజుగారిమనుస్సును సంతోషపెట్టుచుందురు; అందఱును ముఖస్తుతులు చేయుచుండఁగా తా యొక్కరునుమాత్ర మూరకుండుట న్యాయము కాదని యెంచి, రాజశేఖరుఁడుగారు స్తుతివిద్యయందు పాండిత్యము చాలనివారు గావున నసత్యమునకు