పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పడవ ప్రకరణము 113

శాస్త్రమునందలి తన యఖండ పాండిత్యమును దానివలన దనకు గలిగిన గౌరవమును పొగడుకొని ఆంధ్రదేశమునందలి గొప్పవా రందఱును జాతకములను తనకుబంపిన ఫలములను దెలిపిసి కొనుచుందురని చెప్పి దానికి నిదర్శనముగా బెక్కు జాతక చక్రములను విజయనగరాది దూర ప్రదేశముల నుండి ప్రభువులు వ్రాసినట్టున్న జాబులను జూపి,ఫలము జెప్పుట కయి ఆయనయొక్క జన్మపక్షత్రము నుకూడ తెమ్మని యడి గెను.


రాజ----నాకిప్పుడు జ్యొతిష శాస్త్రమునందలి నమ్మకముపోయి నది; నావద్ద కొల్లగా ధనము పుచ్చుకొని వ్రాసిన మావాండ్ర జన్మ పత్రికలలో ఫలము లేవియు నిజమయినవి కావు ;మేము కాశీయాత్రకు బయలుదేరు నపుడు మంచి ముహూర్తము పెట్టుకొని యిల్లు బయలు దేరెనను త్రోవలో గొప్ప యాపదలు వచ్చినవి ; కాబట్టియే మొన్న పెదాపురమునుండి యిక్కడకు వచ్చునపుడు ముహూర్తము చూచు కొనకయే బయలు దేఱినను.


సుబ్బ---నాది అందఱి జ్యౌతిషముల వంటిది కాదు ; నేను చెప్పిన బ్రశ్న కాని పెట్టిన ముహూర్తముకాని యీ వర కాదు;నేను చ్చెపిన బ్రశ్న కాని పెట్టిన ముహూర్తముకాని యీవర కెన్నడును తప్పి పోలేదు; నేను జాతకములో నెన్ని యక్షరములు వ్రాయుదునో యన్ని యక్జ్షరములును జరిగి తీరవలెను.


రాజ---మిరు చెప్పెడు ఫలము నిజమ్యెనను నాకక్కరలేదు.నాకు ముందు మేలుకలుగుననెడి పక్షమున ,వచ్చెడుననుకొన్నది రాకపొయెనని మిక్కిలి వ్యసమునగా నుండును ;నిజముగా వచ్చెనేని, ఆవఱ కేదాని నెదురు చూచియుండటంజేసి వచ్చినప్పు డధిక సంతోషము కలుగదు.కీడు గలుగునని చెప్పెడు పక్షమున నిజముగా వచ్చి