పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వేయుచు వీధిలోనుండి పరుగులెత్తుచున్న మనుష్యుల యొక్క కలకలములు వినవచ్చెను. ఆ సందడియేమో చూతమని వచ్చునప్పటికి తూర్పు వయిపున దూరముగా మంటయును మిన్నుముట్టు పొగయును గనఁబడెను. ఇంతలో సత్రపు బ్రాహ్మణుఁడు వచ్చి కుమ్మరి వీధి తగులఁబడుచున్నది. చూచి వత్తుము రమ్మని రాజశేఖరుఁడు గారిని పిలిచెను. కాని యాతఁడెంత దయార్ద్ర హ్రదయండయినను కొండంత దుఃఖముతో మునిగియున్నవాఁడు గనుక, నిల్లు కదలుటకు మనసు గొలపక యూరకుండెను. సుబ్రహ్మణ్య మావఱకెన్నడు నాపదలు ననుభవించి యెఱుఁగని పసివాఁడగుటచే పరుల కాపద వచ్చినదన్నమాట వినినతోడనే తనయాపద మఱచి పోయి చేతనయిన యెడల వారికి సహాయ్యము చేయవలెనను నుద్దేశముతో తానా బ్రాహ్మణునితోఁగూడ బయలుదేఱి పోయెను. వారక్కడకు బోయి చేరునప్పటికి వేల కొలది జనులు వచ్చి వేడుక చూచుండిరి. కాని వారిలో నొక్కరయినను ఆర్పుటకు ప్రయత్న పడుచుండలేదు. ఇండ్లకు వేసిన వెదురు బొంగులు కణుపులయొద్ద పగిలి పెటపెటధ్వనులతో తుపాకులు మోగినట్టు మోగుచుండెను. ప్రాతతాటాకులు పయికి లేచి గాలిలో తారాచువ్వలను తలఁపించు చుండెను. ఎండల వేడిమిచేత సమీపమునున్న చెఱు వెండి పోయినందున ఇంకిపోఁగా మిగిలిన నూతలలోని నీళ్ళు చేదము నుగుటకయిన వీలులేక అంటుకొన్న యిండ్ల వాండ్రు పెణకలను లాగుటకు ప్రయత్నపడుచుండిరి. ఆ చేరువ యిండ్ల వారు తమ యింటి మీఁద తాటాకుల నయినఁదీసిన మరల వేసికొనుటకు కయి శ్రమ పడవలసివచ్చునని వానిని ముట్టుకోక, కాలుచున్న యిండ్లవారు వేఁడుకొన్నను ఇయ్యక దాచి పెట్టుకొన్న