తీర్చుకొనిరి. రాజశేఖరుడుగారు మిక్కిలి బడలియున్నవారయ్యును, సమీపములో నెక్కడను ఊరులేదని విన్నందున నేవేళకైనను రాజా నగరమునకు బోవ నిశ్చయించుకొని, తమవారినందఱిని లేవ నియమించి యారాజుతో ముచ్చటలాఫుచు దారిసాగి నడవనారంభించిరి.
రాజ - రాజుగారూ! మీపేరేమి ? మీనివాసస్థల మెక్కడ? మీరిక్కడ కొంటిగా నెందుకువచ్చినారు?
రాజు - నాపేరు రామరాజు; మాది పెద్దాపురమునకు సమీపముననున్న కట్టమూరు వాసస్థలము ; మాకక్కడ నాలుగుకాండ్ల వ్యవసాయ మున్నది ; రాజమహేంద్రవరములోనున్న మాబంధువుల జూచుటకై పది దినముల క్రిందట పోయి, నిన్న తెల్లవారుజామున బయలుదేరి మరల వచ్చుచుండగా నొక పెద్దపులివచ్చి నన్నెదిరించినది; నాపైన నున్న యుత్తరీయమును వేగముగా నెడమచేతికి జుట్టుకొని యాచేయి పులినోటి కందించి రెండవచేతిలోని కత్తితో దాని ఱొమ్మున బొడిచితిని; ఆపులి మిక్కిలి బలముకలది కాబట్టి యాపోటును లక్ష్యముచేయక త్రోవపొడుగునను నెత్తురు గాలువలు గట్ట నన్నడవిలోనికి బహుదూర మీడ్చుకొనిపోయెను; ఈలోపల నేను కత్తితో దానిని పలుచోట్లను బొడిచినందున నడువలేక యొక వృక్షసమీపమున బడియెను. నేను బహుప్రయాసతో జేయి వదల్చుకొనుటకై కుడిచేతిలోని కత్తి వదలిపెట్టి దానినోరు పెగిలించి చే యూడదీసికొంటిని; ఇంతలో మునుపటిదానికంటెను బలమైన మఱియొక వ్యాఘ్రము చేరువ పొదయందుండి నామీదికి దుమికెను; కాని దైవవశముచేత గొంచెము గుఱితప్పి నాప్రక్కనున్న చిన్న గోతిలో బడెనూ కత్తిని బుచ్చుకొనుటకు సమయము చిక్కనందున వెంటనే నేను వృక్షము కెగబ్రాకి అది మరల దూకులోపల