పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కధికముగాఁ గలుగనారంభించెను. మునుపటివలెఁ బగటిపూటయందుఁ బదార్థసందర్శన మంతగాఁ గలుగకపోయినను, తదేకధ్యానముతో నున్నందున రాత్రులు కలలయందుమాత్రము తొంటికంటె సహస్ర గుణాధికముగాఁ కలుగుచుండెను. ఆబాధ లటుండఁగా మున్ను రుక్మిణి శిరోజములను తీయించకపోవుటయే బాగుగ నున్నదని శ్లాఘించిన శ్రోత్రియులే యిప్పు డాతనినిఁ బలువిధముల దూషించుటయే కాక సభవారికి నూఱురూపాయ లపరాధము సమర్పించుకోని యెడల శ్రీశంకరాచార్యగురుస్వామికి వ్రాసి జాతిలో నుండి వెలివేయించెదమని బెదరింపఁజొచ్చిరి. ఋణప్రదాతలతో నిండియుండి యిల్లొక యడవిగా నున్నందునను, వీధిలోనికిఁ బోయిన సుగుణములనుసహితము దుగు౯ణములనుగానే పలుకుచు హేళనచేయు మహాత్ములతోను నిండియుండి యూ రొకమహాసముద్రముగా నున్నందునను గౌరవముతో బ్రతికినచోటనే మరల లాఘవముతో జీవనము చేయుటకంటె మరణ మయినను మేలుగాఁ గనఁబడినందునను, ఏలాగునైనను ఋణవిముక్తి చేసికొని యూరువిడిచి మఱియొకచోటికిఁ బోవలె నని ఆయన నిశ్చయించుకొనెను. కాఁబట్టి వెంటనే రామశాస్త్రియొద్దకుబోయి యింటి తాకట్టుమీద నయిదువందల రూపాయలను బదులు పుచ్చుకొని, సొమ్ము సంవత్సరమునాటికి వడ్డీతోఁగూడ దీర్చునట్టును, గడువునాటికి సొమ్మియ్యలేనిపక్షమున నిల్లాతనికిఁ గ్రయ మగునట్టును పత్రమును వ్రాసి యిచ్చెను. ఆప్రకారముగా సొమ్ము బదులుతెచ్చి దానిలో నాలుగువందల రూపాయలతో ఋణములనన్నిటిని దీర్చివేసెను. బదులిచ్చిన మఱుసటినాటినుండియు నిల్లుచోటుచేసి తన యధీనము చేయవలసిన దని రామశాస్త్రి వర్తమానమును పంపుచుండెను. పూర్వము స్కాందపురాణమును జదివి నప్పటినుండియు రాజశేఖరుఁడుగారిఁ మనసులోఁ గాశీయాత్ర వెళ్ళ