పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మ్‌ పచ్చన్న వస్తుశిల్పాలు విమర్శనాత్మక వ్యాసాలు న : సాగర్‌ శ్రీరామకవచం వెల : రూ. 200/- ౨థతులకు :ఉషారాణి శ్రీరామకవచం, జమ్మిచెట్టు బజారు, లాయరు పేట(పో), ఒంగోలు, ప్రకాశం జిల్లా-523 002 పోను: 98854 73934

వా వస్తున్న రచనలలో విఖిన్నంగాను, విలక్షణంగాను ఉండటమే కాకుండా ఈ సంకలనంలో ఒక వినూత్నమైన సాహిత్య సిద్దాంతాన్ని ప్రతిపాదించారు సాగర్‌శ్రీరామ కవచం (ఎస్‌. రామమోహనరావు). అది, సాహిత్య సృజనకు సంబంధించిన వస్తు శిల్పాల గురించి. రచనలలో ఏవిషయాలగురించి చెప్పబడుతుందో దానిని “వస్తువు” అన్సీ చెప్పే విధానాన్నీ పద్దతిని శిల్చం అని వరిగణిస్తాం. ఆ రెండు అవిభాజ్యమ్రైనవి, నజీవ ఐక్యతతో నిలుస్తాయి. అయితే, అందుకు ఖీన్నంగా వస్తుశిల్పాల విషయంలో ఒక కొత్త సిద్ధాంతాన్ని తన వ్యాసాలలో సూత్రీకరించి, విమర్శకులకు, సాహితీ వేత్తలకు మేధోమధనంచేసి, ఎంతో పరిశోధన చేయవలసిన పని పెట్టారు ఈ సంపుటంలో - సాగర్‌ శ్రీరామకవచం.

సంక్షిపంగా ఆ సిద్ధాంతం యిదీ - ఒక వస్తువునీ అనుసరించి, మరో వస్తువు, దానిని అనుసరించి సాగే శిల్బంతో సమాశయంగా మరో శిల్చం - ప్రచ్చన్నంగా ఉంటాయి. ఈ ప్రచ్చన్న వస్తుశిల్పాలు రచయిత పరిణతి మూలంగా అంతస్సారంగా ప్రవహిస్తాయి. అవి రచన మధథ్యలోపుట్టి రచనముగింపుకి తారాస్థాయికి చేరుకుంటాయి. బలహీనమైన 'ప్రధానవస్తువు ప్రచ్చన్న వస్తువుగా, ప్రధాన శిల్చంగా ఆవిష్మరింపబదతాయి. ఆ కారణంగా, రచనలోని పాత్రలు కొంత దూరం నడిచాక రచయిత మాట ఏమాత్రం వినకుండా స్వతంత్ర ప్రతిపత్తిని ఏవిధంగా చాటుకుంటాయో, ఆ విధంగానే ప్రచ్చన్న వస్తు శిల్పాలు రచనా 'కమంలోకి దూసుకుచ్చి రచనాక్రమాన్ని ముందుకు తీసుకువెదతాయి. ఈ విధమైన పప్రచ్చన్నవస్తు శిల్పాలు పరిష్కారరంగంలోకి రచయిత చేరుకోవాలంటే తాను ఒక తపోస్థితికి, ఒక నిమగ్నతకి, ఒక అలౌకిక తాదాత్యస్టితికి లోను కావాలి. అప్పుడే గొప్ప రచన సృష్టించబడుతుంది.

ఈ విథభంగా వ్యక్తపరిచిన తన కొత్త ప్రతిపాదనని విమర్శకులు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ప్రతిరచనలోను ఈ వినిర్మణ ప్రక్రియను స్పష్టంగా చూపగలననీ,కాలం మాత్రం ఈ అభిప్రాయాన్ని స్వీకరిస్తుందనే నమ్మకం రచయితకు ఉండటం అభఖినందనీయమే! అయితే యీ సూత్రీకరణపై విస్తృతంగా చర్చ జరగవలసిఉంది.

ఈ సంకలనం మూదు భాగాలుగా వర్గీకరించబడింది. బం వ్యాసాలతో “'వ్రచ్చన్న వస్తుశిల్పాలు సాగరవచనం శీర్షికన 15 వ్యాసాలు చివరగా 'విఖిన్ను పేరుతో 05 వ్యాసాలు ఉన్నాయి. నిజానికి ఈ 40 వ్యాసాలలో కేవలం ఐదు మాత్రమేవ్యాసాలు”

| తెలుగుజాతి పత్రిక జుమ్నునుతి ఈ ఏప్రిల్‌-2021 |


అనదగినవి. మిగిలిన చిన్నవ్వాసాలు లేదా “గల్చికలు” అని పేర్ళానవచ్చు. మొదటి భాగంలో వ్యాసాలు ప్రచ్చన్న వస్తు శిల్పాల గురించి - కొంత వివరణ, మరోకోణం, వాటి వెనుక మేథస్సు పాత్ర, వాటి యొక్క అంతర్గత శక్తి రూపాలు ఆ రెండిటి యొక్క (క్రియా శీల పాత్ర మొ; విషయాలపై అనుసంధానంగా వెలువడినవి. ఇక్క రెండవభాగం “సాగరవచనం”లో నివి భాష్క విమర్శ, పోస్ట్‌ మోడర్నిజమ్‌ వంటి అంశాలపై చిన్న వ్యాసాలు, వీటిలో 'మహిళా ఉద్యమాలు” వేరు, స్తీ ఉద్యమాలు వేరు (పు. 87) '1ప్రవచనకారులతోనే పెనుప్రమాదం?” (పు 106) వంటి వ్యాసాలలో రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలు వివాదాస్పదంగ కొందరు భావించే అవకాశం ఉంది. మూడవ భాగంలో - అస్తిత్వవాదం, వర్తమాన విమర్శపై ఒక సమాలోచన, సమాజమూ- విమర్శావేరు కాదు అనే చిన్న వ్యాసాలు సద్విమర్శనాత్మకంగా సాగాయి. మొత్తం మీద రచయిత ఈ సంకలనంలో ప్రచ్చన్నవస్తు శిల్పాలపై వినూత్నమైన ప్రతిపాదన చేయటమే కాకుందా, వస్తు శిల్పాల పట్ల ప్రాచీన సిద్ధాంతాన్ని వల్లెవేయటం ఏమాత్రం అంగీకారం కాదని, అదే సమయంలో తాను చేస్తున్న సూత్రీకరణపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతో ఉందనీ 'పేర్మానటం ఆహ్వానించదగిన విషయం. రచయిత చెప్పినట్లుగా “ఇదే ప్రచ్చన్న వస్తుశిల్పాల ప్రచ్చన్న రహస్య యాత్ర రచనలో... అది తవ్వి తీయాల్చిన అవకాశం ఎంతో ఉంది” గత దశాబ్దకాలంలో (2010- 2020) సాగర్‌ రచనలు 'రసరేఖి “రచనా, “విఖ్యాత తెలుగులోగిలి మొ మాసవత్రికలలోను “వునంి 'ఆంధ్రప్రభి దినవత్రికలలోను ప్రధానంగా 22 చిన్నవ్యాసాలు “నవమల్లెతీగ” మాసపత్రికలలోను 'ప్రచురింపబడి పాఠకులను ఆలోచింపచేస్తూనే ఉన్నాయి.



-లఎం.వి. శాసి రశ్తత413429 సరసిగాది నుండి నగ “హి. 2 కార్టూన్ల వవరననన. పుస్తకాలు

కరోనా కరకజ్జం పుటలు; 80, వెల :50,/ ప్రతులకు : నవోదయ బుక్‌ హౌస్‌ 8-3-865, కాచీగూడ, 'హైదరాబాద్‌-500 027 ఫోను: 040 24652387, 900413413

గరిపెల్లి అశోక్‌ రచనలు (ప్రతులకు:గరిపెల్లి సౌజన్య 404, వి.ఎల్‌ఆర్‌. రెసిడెన్సీ, సిద్ధార్ద స్కూల్‌ ప్రక్కన, శ్రీనివాసానగర్‌, సెద్దిపేట, తెలంగాణా 502 105 చరవాణి: 9849649101 ఓ న్‌ సరికొత్త క్‌ పులి న్‌ పుటలు :58, వెల :156/-


మా బడి కతలు పుటలు: 71, వెల:80/