పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సగంపడిపోయిన 12వందల ఏళ్ల ఆలయాన్ని చూచి విలపించాలో లేక సమీప పట్టణాల్లో ఆంబరాన్నంటే అధునాతన భవంతుల్ని చూచి ముచ్చట పడిపోవాలో తెలియక తికమక పడుతున్ననాకు, ఒకచిన్న ఆలయం గోడకు వారగా అనించిన పాఠ్వనాధ విగ్రహం, భీమేశ్వరాలయం ముందుగోడ పక్కనున్న మహిషాసురమర్దని విగ్రహం, ఆలయంలోపల శివుడు కొలువై ఉన్నాడని చెప్పకనే చెబుతున్న ఓపికలేక ఒత్తిగిల్లిన నందివిగ్రహాలు కొంత ఊరటనిచ్చాయి.

అంతలో చంద్రమౌళిగారందుకాని, ఈ ఆలయంముందు పొలందున్నుతుంటే 24 జైనతీర్ధంకరులను అందంగా చెక్కిన జైన శిల్చం బయల్చ్బడగా దాన్ని హైదరాబాదు స్టేట్‌ మ్యూజియానికి తరలించుకెళ్లారని చెప్పాడు. అంతేకాదు వేంగీచాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని సైన్యాధ్యక్షుడు అద్దంకి పండరంగడు, ఈధర్మవరంలోనున్న తన గురువైన ఆదిత్యభట్టుకు కొంతభూమిని దానం చేసినట్లు క్రీ. శ. 850ఏళ్లనాటి కడియరాజు శాసనం వల్ల తెలుస్తుందని కూడా చెప్పాడు. అయితే ఈ భీమేశ్వరాలయం, చాళుక్యభీముని కాలంలో నిర్మించబడి ఉంటుంది. తరువాత పంగరంగని మునిమనుమడైన దుగ్గరాజు, ఈ ప్రాంత పాలకుడుగా, రెండో అమ్మరాజు కాలంలో ధర్మవరంలో కటకాభరణ జినాలయాన్ని నిర్మించినట్టు, ఆలయ నిర్వహణకు మలియంపూడి గ్రామాన్ని అమ్మరాజు చేత దానం చేయించిన శాసనాధారాలు ధర్మవరంలోనే ఉన్నాయి. ధర్మవరానికి జినధర్మవరమనే మరోపేరు కూడా ఉంది. అయితే, ధర్మవరంలోని పండరంగని శాసనం తెలుగుభాషాపరంగా ప్రాధాన్యతను సంతరించుకొందని కూడ చంద్రమౌళిగారు చెప్పారు.ఇక అక్కణ్ణించి కారెక్కి ఊళ్ళోఉన్న సీతారామాలయంలోకెళ్లాం. చాళుక్యభీముడు క్రీ.శ. 897లో వేయించిన శాసనాన్ని ఆలయంలోని భిన్నమైన వర్దమానమహావీర, అమ్మవారు, చెన్నకేశవ విగ్రహాలను చూశాం. ఒకప్పుడు రాజపోషణలో, జైన,శైవ మతసామరస్య కేంద్రంగా భాసిల్లిన ధర్మవరం, ఆ తరువాత, కొణిదెనచోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర పాలకుల ఆదరణ చవిచూచింది. గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా అధీనంలోకొచ్చిన ధర్మవరం వద్ద మరో గ్రామాన్ని నిర్మించి, అప్పటివరకూఉన్న ధర్మవరంఅన్న 'పేరునుకాదని, అతని సేనాని ఎకలస్‌ఖాన్‌, తనపేరట ఎకలసపురమనే కొత్తపేరు పెట్టాడు. ఆ సంగతిని తెలియజేసే శాసనం రామాలయంముందు నిలబెట్టి ఉంది. అందులో అతడు గ్రామంలో కల్పించిన వసతులు, నీటి పారుదల సౌకర్యం, పంటలకు గిట్టబాటుధరలను నిర్ణయించి,ప్రజల అభిమానాన్ని సంపాదించిన వివరాలున్నాయి.

ధర్మవరాన్ని గురించి ముగించేముందు ఇప్పటికీ జనంనోళ్లలో నానుతున్న కాటమరాజు కథలు, పల్లికొండ, యలమంచి వెళుతూ ధర్మవరంలో ఆగి, కొలిచిన స్వామి భీమేశ్వరుడా చెన్నకేశవుడా అనే ఆలోచనలో పడ్డాను.

అప్పటికే ఉదయం 9.30అవుతుంది. మనపని మనం చేసుకొంటుంటే ఆకలి తన పనిగా నిశ్శబ్ద సంకేతాలిచ్చింది. ధర్మవరంనుంచి 20 నిమిషాల్లో అద్దంకి చేరుకొని వేయిస్థంభాల గుడిదగ్గర ఒక హోటల్లో టిఫిన్‌చేస్తూ,చూడాల్సిన వాటిగురించి ముచ్చటించుకున్నాం.

అద్దంకి అనగానే మనకు పండరంగడు, అతడి శాసనం గుర్తుకొస్తాయి. అద్దంకి అనగానే అప్పుడెప్పుడో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, ఆత్మగౌరవంతో పుట్టుకొచ్చిన స్వతంత్రపాలకులైన రెడ్డిరాజులు గుర్తుకొచ్చారు. ప్రజల్ని పరపీడననుంచి కాపాడి 'స్వేచ్చావాయువుల్ని పేల్చే అవకాశాన్నిచ్చి, అద్దంకిని రాజధానిగా తీర్చిదిద్ది రెడ్డిరాజ్యానికి పురుడుపోసిన నెపథ్యం గుర్చుకొచ్చింది. గుండ్లకమ్మ తీరంలో కమ్మని పంటపొలాలనడుమ, ఎత్తైన కోటసౌధాలు, చూడచక్కటి ఉద్యానవనాలు, కవులు, కళాకారులతో భూతలస్వర్థాన్ని తలపించింది అద్దంకి అన్న సాహితీ వర్ణనలన్నీ కళ్లముందు కదలాడాయి. అద్దంకి మహానగరంలో 'ప్రోలయవేముడు నిర్మించిన నగరీశ్వర, కమఠేశ్వర, గణపతి ఆలయాలను చూడాలనుకొన్నాం. ఇంతలో చంద్రమౌళిగారు అందుకొని ఒక సమకాలీన గ్రంథంలో అద్దంకి నగరవర్ణనలను వినిపించిన తరువాత, ఆసక్తికరమైన సంగతిని చెప్పారు. అదేమిటంటే అద్దంకి నగరంలో