పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంది. కేరీ స్థానికులయిన పండితులతో ఆయా వ్యాకరణాలు రూపొందించాడు.

ప్రతిభాషా వ్యాకరణం పీఠికలో ఆయా ప్రాంతీయ సహాయకులను, రచయితలను ప్రత్యేకంగా ఉటంక్కించాడు. కొన్ని సందర్భాల్లో సహాయకుల పేర్లు ఉదహరించని చోట్ల Natie Pundits, Learned pundits, learned Munshies, Natie assistants అని మాత్రమే పేర్మొన్నాడు. తెలుగు వ్యాకరణం 1814లో అచ్చయింది. ఇందులో తెలుగు సంస్కృత జన్యమనే వాదించాడు. దీనికి తోడు తెలుగు వ్యాకరణ రచనకు సహాయపడిన పండితుల్లో సుబ్బశాస్త్రి (Subba Shastree) అతని సోదరుడు నాగేశ్వరశాస్త్రి (Nageswar Sastree) సహాయం మరువలేనిదన్నాడు. పైగా వారు జ్ఞానంగల వ్యాకరణవేత్తలని కితాబు యిచ్చాడు.

ఇంతవరకు బాగానే ఉంది. 1812 మార్చ్‌ 12వ తేది సిరంపూర్‌ ఫైస్ అగ్నిప్రమాదానికి గురయింది. ఈ అగ్ని ప్రమాదంలో 14 భాషల్లోని పోత అక్షరాలు, 12 వందల రీముల కాగితం, ఎన్నో రాత ప్రతులు దగ్ధం అయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో కొంతవరకు కాలినా మిగిలిన భాగమయిన బెంగాలి రామాయణం, బహుభాషా సమానార్ధకపద నిఘంటువు (Polyglot dictionary) మాత్రం దక్కాయి. ఇవి నేటికీ సిరంపూరు కేరీ గ్రంథాలయంలో అముద్రితంగానే ఉన్నాయి.

కేరీ తయారు చేసిన బహు భాషా సమానార్థక పద నిఘంటువు (Polyglot dictionary) కొంత చర్చించవలసిన అవసరం ఉంది. బహుభాషా నిఘంటువు తయారు చేయడానికి ఏదో ఒక భాషను మూలంగా స్వీకరించి యితర భాషలలోని సమానార్థక అర్దం, సరయిన అర్ధం వచ్చేలా తయారు చేసే ప్రక్రియను బహుభాషా సమానార్థక పద నిఘంటు నిర్మాణం అంటారు. ప్రపంచంలో తొలి బహుభాషా సమానార్థక వద నిఘంటువు కార్టినల్‌ ఫ్రాన్నిస్కో (Cardiral Fransisco) నిర్వాహకత్వంలో 1522వ సంవత్సరం స్పెయిన్‌లో ఆరు సంపుటాలుగా అచ్చయింది. ఇది బైబిలు సంబంది పాతనిబంధన హిబ్రూ, గ్రీకు భాషల్లోను, కొత్త నిబంధన గ్రీకు లాటిన్‌ భాషల్లోనూ తయారయింది. సిరంపూరులో ఉన్న సమానార్థక పద నిఘంటువు 13 భారతీయ భాషల్లో సంస్కృతాన్ని మూల భాషగా గ్రహించి తయారు చేశాడు. దీనికి యూనివర్శల్‌ డిక్షనరీ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌ అని పేరుపెట్టాడు. (uniersal dictionary of Indian Languages) బహుబాషా సమానార్థక పదనిఘంటువు చేతితో తయారయిన కాగితం (hand made paper) పసుపు రంగులో దళసరిగా ఉంది. కాగితం, క్రిమిద్రష్టం కాకుండా క్రిమి సంహారక రసాయనాలతో ఆరబెట్టి భద్రం చేశారు. కాగితానికి ఒక వైపు మాత్రమే నల్లని సిరాతో రాసి ఉంది. పదమూడు భాషలు వేర్వేరు గళ్ళలో రాసి ఉన్నాయి. మొదటి పుటలో సంస్కృతంతోపాటు మిగిలిన భాషల పేర్లు బెంగాలి లిపిలో ఉన్నాయి. తరువాత పుటల్లో వరస క్రమంలో 1 నుండి 13 వరకు అంకెలు వేశారు. ప్రతి పుటకు 6నుండి 8 పంక్తులున్నాయి. ముఖ పత్రం లేదు. కాగితం ఫొడవు 52 సెం.మీ., వెడల్పు 20 సెం.మీ. మొత్తం పుటలు 312, పదాల సంఖ్య 2184. ఇందులో ముగ్గురిచేతి రాతలున్నాయి. ఒకటి కేరీది కావచ్చని ఆనాటి గ్రంథాలయాధికారి సునీల్‌ కుమార్‌ చటర్జీ (1976 ప్రాంతంలో) చెప్పారు. నిఘంటువు అంతా బెంగాలి లిపిలోనే ఉంది. చదివి అర్ధం చెప్పిన ఆనాటి సహాయ గ్రంథాలయాధికారి అనిల్‌ దాస్ కి కృతజ్ఞతలు. కొన్ని పుటల్లో కాలిన మచ్చలున్నాయి. ఇది పూర్తయే నాటికి హిబ్రూ, గ్రీకు పదాలు చేర్చాలనే తలంపు ఉందని ఒక లేఖలో కేరీ రాశాడు. ఈ గ్రంథంలోని 13 భాషల వివరాలు. సంస్కృతం, కాశ్మీరి,పంజాబి జలంధర్‌, మధ్య ప్రదేశ్‌ భాష పర్వతి భాష మైధిలి, బెంగాలి, ఒరియా, మరాఠీ, గుజరాతి, తెలుగు, కన్నడం, తమిళం.

ఇది గనక అవ్బుడు ముదించి నట్టయితే ప్రపంచంలో బహుభాషా సమానార్థక పదనిఘంటువు ముద్రించిన ఖ్యాతి విలియం కేరీకి ముద్రించిన దేశంగా భారత దేశానికి దక్కేది.

స్పందన

“అమ్మనుడి " గత పది నెలలుగా ప్రచురిస్తున్న ధారావాహిక “పడమటి గాలితో నివురు తొలగిన తెలుగుభాషా సాహిత్య సంపద” వ్యాసం- ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారిగారు అద్భుతంగా రాస్తున్నారు. ప్రతీ మాసం తప్పక చదువదగినది. తెలుగు భాష సాహిత్యాల ఘనమైన చరిత్రను వెలికితీసి అందిస్తున్నందుకు రచయితకు కృతజ్ఞతలు.

-ఆచార్య అవుటి జగదీష్‌ 'హైదరాబార్‌


కవిత

హోళీ -హోళికా

హోళీ హోలికా
దుర్గుణాల ప్రతీతి (ప్రతీక )
అరి షద్వర్థాల కూడిక
అంతఃశత్రువుల మాలిక
ఆ కామ క్రోధ మోహ మద మాత్సర్యాల కలయిక
అంతం చేయాలి ఆ మన్మధుని ఇక
ఆ ఫాల్గుణ శుద్ద పౌర్ణమి ముందుగా
ఆమని ఆగమనానికి నాందిగా
ఆలోకించి ఆడాలి మనమందరమిక
ఆ సప్త వర్ణ శోఖిత చన్టనమిక
ఆస్వాదించి ఆశ్లేషించాలిక
ఆహ్వానించి ఆహ్హాదపడాలిక
అదియే అదియే హోళిక
అవధి లేదు మన ఆనందానికిక
అందరం జరపాలి వేడుకగా
ఆబాల గోపాలం వాడుకగా
గుడికందుల ప్రకాశం
9550894025

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

32