పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాపారం చేశాడు. విలియం కేరీ ప్రారంభంలో తండ్రి వద్దే చదువుకుని అనంతరం ఉన్నత విద్వపూర్తి చేశాడు. ఈ కాలంలోనే ఫ్రెంచ్, హిబ్రూ, లాటిన్‌, జర్మన్‌, అరబిక్‌, సంస్కృతం తదితర భాషలను నేర్చుకున్నాడు. ప్రారంభంలో బతుకు తెరువుకోసం చర్మకార వృత్తి చేశాడు. 1781లో డోరతిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళయేనాటికి డోరతి నిరక్షరాస్యురాలు. వైవాహిక జీవితంలో 7గురు పిల్లలు పుట్టారు. అందులో యిద్దరు ఆడపిల్లలు బాల్యంలోనే చనిపోయారు. 1789 నాటికి ఒక సంఘానికి దైవబోధకుడయాడు. డేనిష్‌ మిషన్‌ పక్షాన భారత దేశానికి 1793 నాటికి కలకత్తా వచ్చాడు. కలకత్తాకు ఉత్తరంగా ఉన్న బండేల్‌ అనే పోర్చుగీసు స్థావరం అనుకూలంగా ఉంటుందని ఎంచుకున్నాడు. అక్కడ డాక్టర్‌ తామస్‌ అనే ఉపాధ్యాయుడితోను రాంబస్‌ అనే అనువాదకుడితోను పరిచయం అయింది. దేశం విడిచి వచ్చినందువల్ల, కొత్త ప్రదేశం అయినందువల్ల తెచ్చుకున్న డబ్బు అయిపోతున్నందువల్ల ఆర్ధికంగా కొంత బాధ ఏర్పడింది. అందువల్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఉడ్నే అనే బెంగాలీయుడి సహాయంతో మాల్దా సమీపంలోని ముడ్నబాటి అనే గ్రామంలో నీలిమందుకర్మాగారంలో చిన్న ఉద్యోగం అభించింది. అది కేరీకి ఎంతో మేలయింది. సామాన్య ప్రజలతో సన్నిహితంగా ఉన్నందువల్ల బెంగాలి భాష త్వరగా నేర్చుకునే అవకాశం కలిగింది. భాష నేర్చిన అనంతరం తాను వచ్చిన సంస్థయిన లండన్‌ మిషనరి సొసైటీకి లేఖరాస్తూ స్థానిక భాషల్లో బైబిలు, వ్యాకరణాలు, భారతీయ భాషా గ్రంథాలు ముద్రించ వలసిన అవసరం ఉందని తెలియజేశాడు. కేరీ లేఖ ఆధారంగా లండన్‌ మిషనరీ సొసైటీ కేరికి తోడుగా జాషువ మార్షమన్‌, విలియం వార్ట్‌లను ఎంపిక చేసి కలకత్తాకు పంపించారు. మార్షమన్‌ భాషా శాస్త్రవేత్తగా, అనువాదకునిగా, సంపాదకునిగా, పుస్తక విక్రేతగా ముఖ్యంగా ముద్రణలో అనుభవమున్న వాడు. విలియం వార్డు అతి సామాన్యమైన వడ్రంగి కుటుంబానికి చెందినవాడు. ఐతే ముద్రణలో బాగా అనుభవముంది. అందువల్ల భారత దేశానికి మిషనరీగా, ప్రెస్ సూపరింటెండేంట్‌ గా గ్రంథముద్రణ చేయాలనే సంకల్పంతో వచ్చాడు.

మార్ష్‌మన్‌, వార్ట్‌లు భారత దేశానికి వచ్చేసరికి శ్రీరంగ పట్టణం బ్రిటీషువారు కైవసం చేసుకుని దాదాపు సంవత్సరం అయింది. ఆ కారణంగా బ్రిటీష్‌ వారి రహస్యాలు బయటకు చేరకుండా ఉండేందుకు దేశమంతా కట్టుదిట్టం చేశారు. ఈ కారణం వల్ల ముద్రణకుగాని, అచ్చు యంత్రస్థాపనకుగాని అనుమతి లభించలేదు. అదేకాలంలో సిరంపూరు డేనుల ఆధీనంలో ఉంది. కేరీకూడా డేనులకు సంబంధించిన వాడే కాబట్టి సిరంపూర్‌లో పాఠశాల స్థాపనకు,ప్రెస్‌ నిర్మాణానికి గవర్నరు అనుమతి లభించింది. ఆ వెంటనే 1800 ప్రాంతంలో పాఠశాల స్థాపించారు. పరిసర గ్రామాల నుంచి పిల్లలకు ఉచిత విద్యాబోధన ప్రారంభం చేశారు. మరికొంతకాలానికి బోర్డింగ్‌ పాఠశాల ప్రారంభం అయింది. ఇది ప్రస్తుతం కైైస్తవవేదాంత విద్యకు కేంద్రమయిన సిరంపూరు విశ్వవిద్యాలయంగా ఎదిగింది. దానికి తోడు 1801 నాటికి సిరంపూర్‌ ప్రెస్‌ స్థాపనకూడా జరిగింది. 1801 ఫిబ్రవరి 7 నాటికి బెంగాలి భాషలో కొత్త నిబంధన అచ్చయింది. ఇదేవారు ప్రచురించిన ప్రథమ ముద్రణ.

సిరంవూర్‌లో 1801 నుంచి 1832 వరకూ 47 భాషల్లో ముద్రణ జరిగింది. 40 భాషల్లో పోత అక్షరాలు తయారు చేసి భారత దేశమంతటికీ సరఫరా చేశారు. సిరంపూర్‌ మిషన్‌ ప్రెస్‌ ప్రింటింగ్‌లో అనుభవమున్న మార్ష్‌మన్‌, వార్డుల సహకారంతోపాటు స్థానికంగా ఉన్న గంగాకిషోర్‌ భట్టాచార్య సహాయం ఎంతయినా ఉందని వారి లేఖల్లో ప్రస్తావించారు. Katheine Smith Diehl రాసిన Early Indian Imprints page 64లో స్పష్టంగా ఉంది.

The Tenth momoir respecting the translations (1834) say that printing had been done at Serampore in forty seen languages for aboe forty of which types had been cast at Serampore. Serampore had also become the source of supply for entire country in the matter of types and Presses were started early where 1801 నుంచి 1832 వరకు బైబిళ్ళు, వ్యాకరణాలు, నిఘంటువులు, రామాయణం మొదలయినవి 47 భాషల్లో రెండు లక్షల 12 వేల గ్రంథాల ముద్రణ జరిగింది. ఐతే కేవలం బైబిలుకు సంబంధించినవి మాత్రం 33 భాషల్లో జరిగింది. సంస్కృతము హిందీ,బ్రిజ్‌ భాషా, మరాఠా, బెంగాలి, ఒడియా, తెలింగా, కర్నాటా, పుస్లీ పంజాబి, కాశ్మీరి, అస్సామి, బర్మా, పాలి, చైనీస్‌, ఖాసి, బిర్‌ కనీరాా ఉదయపురా, మార్వా, జయపూర, కున్‌కురా, తముళ్‌, సింగాలిస్‌, ఆర్మినియా, మాల్షివియన్‌, గుజరాతి, భోషి, సింధ్‌, పుచ్, నేపాల, మలయా, హిందుస్తానీ, పర్షియన్‌ భాషల్లో ముద్రణ జరిగింది. ఇదే కాలంలో నిఘంటు నిర్మాణం ముద్రణ కూడా జరిగింది. బెంగాలి, సంస్కృతం, మరాఠి భాషల్లో ముద్రించిన నిఘంటువులు నేటికీ కేఠీ గ్రంథాలయం, సిరంపూరులో ఉన్నాయి. 1815 నాటికి కేరీ 7 భాషల్లో వ్యాకరణాలు రచించి ముద్రించాడు. 1. సంస్కృతం 2. చైనా 3. బర్మా 4. బెంగాలి 5. మరాఠా 6. పంజాబి, 7. తెలుగు. తెలుగు వ్యాకరణం 1814లో ముద్రణ జరిగింది. ఈ ప్రతి ప్రస్తుతం నేషనల్‌ ల్లైబరీ కలకత్తాలో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

31