పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 98481 23655


పడమటిగాలితో నివురు తొలగిన

తెలుగు భాషా సాహిత్య సంపద

తెలుగు భాషా సాహిత్యం తరతరాలుగా తరగని సంపదగా వర్దిల్లుతుంది. ఉన్న సాహిత్యం అంతా తాళపత్రాల మీదో, బూర్డు పత్రాల మీదో రాగిేరేకుల మీదో ఉందే తప్ప అచ్చుకాలేదు. అచ్చులోకి రాలేదు. దినదినాభివృద్ధి చెందవలనిన విజ్ఞాన సంపద అంతా బూజుపట్టి, చెదలు పట్టి, బూడిద పాలయిందే తప్ప తరతరాలకు తరాల నిధిగా నిలవలేదు. అటువంటి పరిస్థితుల్లో పాశ్చాత్యులు మన దేశానికి రావడం వ్యాపారం చేయడం ఒక ఎత్తయితే, మరో వైపు మన సాహిత్యం పునరుద్ధరణ గావించడం మరో ఎత్తయింది. క్షీణదశలోని సాహిత్య సంపదను లక్షణంగా ముద్రించి తరతరాలకు అందించిన పాశ్చాత్య దేశవాసులు ఎందరో ఉన్నారు.

1658లో డచ్‌ వారు ఆంధ్రప్రదేశ్‌ లోని పాలకొల్లు, జగన్నాయకపురం, కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం మొదలయిన ప్రాంతాల్లో వారు గిడ్డంగులను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేశారు. వారి వాణిజ్యం వ్యాపారలావాదేవీలు సరిగా లేనందువల్ల, డచ్‌ వారి స్థావరాలన్నీ ఇంగ్లీషు వారే కైవసం చేసుకున్నారు. ఫ్రెంచ్‌ వారు 1669 నాటికి తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధి చేసుకున్నారు. గోల్కొండ నవాబు నుంచి ఎగుమతి పన్నులేకుండా ఫర్మానా సంపాదించారు. మచిలీపట్నంలో 1693 నాటికి ఫ్రెంచ్‌ పేటనే నిర్మించి ఒక గిడ్డంగిని కూడా ఏర్పాటు చేశారు. వీరి గిడ్డంగులు యానాం, నరసాపురం, రాజమండ్రి, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంలో నిర్మించారు. ఫ్రెంచ్‌ వారి పలుకుబడి వల్ల తెలుగు భాష, సాహిత్యంలో ఆయా భాషాపదాలు చోటు చేసుకున్నాయి. కస్తూరి రంగ కవి రచించిన ఆనందరంగరాట్చందము, దిట్టకవి కృతమైన రంగరాయ చరిత్రము, చట్రాతి లక్ష్మి నరసకవి రచించిన పద్మనాభ యుద్దము మొదలయిన గ్రంథాల్లో ఫ్రెంచ్‌ వారి ప్రస్తావన, వారి పరిస్టితి, స్థితిగతులు వ్యాపారాలు కనిపిస్తాయి.

వీరి తర్వాత ఎక్కువకాలం పాలించినవారు ఇంగ్లీషువారు. వీరి కాలంలోనే వ్యాపారంతోపాటు సాహిత్య సంపద వెలుగులోకి వచ్చింది. దీనితో పాటు విద్య, వైద్యాలయాలవ్చద్ది బాగా కనిపిస్తుంది. విద్యతో గ్రంథ ప్రచురణ కూడా బాగా చోటుచేసుకుంది. దీనికో కారణం ఉంది. పాశ్చాత్య దేశాలు అంచెలంచెలుగా భారత భూభాగంలో అడుగుపెట్టి దేశమంతా వ్యాపించారు. అలా వచ్చిన వారికి స్థానిక భాష ఓ పెద్ద సమస్య అందుకోసం ఆనాటి సివిల్‌ సర్వెంట్లు అరబ్బీ పారశీకం, హిందూస్తానీ, సంస్కృతం, హిందీ, బెంగాలి, ఒరియా, మరాఠీ, గుజరాతి,తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం అనే పదమూడు భాషలతోపాటు ఆనాటి వ్యావహారిక పదజాలం నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ భాషలన్నీంటిలో వ్యాకరణాలు, నిఘంటువులు, పదకోశాలు ప్రాంతాల వారీగా తయారు చేయడం మొదలు పెట్టారు. ఇతర భాషల్లో వ్యాకరణాలు, నిఘంటువులు మొదలయినవి సిద్దం చేసిన పాశ్చాత్యులు చాలా మందే ఉన్నారు. వారిలో పారశీకం-రిచర్జన్‌, సంస్కృతం - కోల్‌ బ్రూక్‌, ఎల్లిస్‌, సదర్‌ లాండ్‌, మెక్‌ నాటన్‌, మొయనీర్‌ విలియమ్స్‌ హిందుస్తానీ, డాక్టర్‌ గిల్‌ క్రిస్ట్‌, బెంగాలి - డాక్టర్‌ విలియం కేరీ, ప్రొఫెసర్‌ హీటన్‌, తమిళం - బేషి (1728) రోట్లర్‌, ఆండర్సన్‌, తెలుగు-కాంబెల్‌, మారిస్‌, బ్రౌన్‌ మలయాళం - బెయిలీ, గుండర్ట్‌ కన్నడం - కిట్టెల్‌, మెక్కీరల్‌, రోల్ఫ్, మరాఠి - మేజర్‌ మోల్స్‌ వర్త్‌, ఒరియా - మేస్తర్‌ సట్టన్‌, గుజరాతి - డ్రమ్మండ్‌ మొదలయిన వారున్నారు. తొలినాళ్ళలో మనకు అందుబాటులో ఉన్న తెలుగు నిఘంటువులు.

విలియం బ్రౌన్ -ఎ వొకాబులరి ఆఫ్‌ జంటూఅండ్‌ ఇంగ్లీష్‌ మద్రాసు 1818, కాంబెల్‌, ఎ.డి- ఎ డిక్షనరీ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌, మద్రాసు-1821, మోరిస్‌, జె.సి- ఎ డిక్షనరీ ఇంగ్లీషు - తెలుగు - మద్రాసు -1835, నికొలస్‌, జె- ఎ వోకాబులరి ఆఫ్‌ ఇంగ్లీష్‌ అండ్‌ తెలుగు, మద్రాసు -1841 బ్రౌన్‌, సి.పి - ఎ డిక్షనరి, తెలుగు అండ్‌ ఇంగ్లీషు, మద్రాసు - 1853, పెర్సివల్‌ (రెవ)సి - తెలుగు- ఇంగ్లీష్‌ డిక్షనరి మద్రాసు - 1862, హాలర్‌, పి- తెలుగు నిఘంటువు కంటైనింగ్‌ తెలుగు ఇంగ్లీషు అండ్‌ ఇంగ్లీషు - తెలుగు రాజమండ్రి 1900, మొదలయినవి ఎన్నో ఉన్నాయి. దేశీయులయిన వారు కూర్చిన నిఘంటువులు కూడా బాగానే ఉన్నాయి. రామకృష్ణ శాస్త్రులు - వొకాబులరి యిన్‌ ఇంగ్లీష్‌ అండ్‌ తెలుగు, మద్రాసు- 1841 వీరాస్వామి మొదలియార్‌: ది బిల్దర్‌ వాకాబులరి యిన్‌ ఇంగ్లీష్‌ అండ్‌ తెలుగు - మద్రాసు - 1841, శంకరనారాయణ, పి - ఎ స్మాలర్‌ ఇంగ్లీషు తెలుగు డిక్షనరి, మద్రాసు - 1804, -తెలుగు - ఇంగ్లీషు డిక్షనరి, మద్రాసు-1900 మొదలయిన వాటితోపాటు తెలుగు - తెలుగు శబ్ధకోశాలలో శబ్దరత్నాకరం, శబ్ధార్థ చంద్రిక, సూర్యారాయాంథ్ర నిఘంటువు, వావిళ్ళవారి నిఘంటువు, ఆంధ్ర వాచస్పత్యము, మొదలయిన వాటితోపాటు తెలుగు, ఉరుదు, హిందీ, మరాఠి, ఒరియా నిఘంటువులు ఇంగ్లీషు ప్రాతిపదికగా వచ్చాయి.

19వ శతాబ్ధి ప్రథమ పాదంలో దేశవ్యాప్తంగా కోశవ్యాకరణాలు, సాహిత్య గ్రంధాల ముద్రణ విరివిగా జరిగాయి. దీనికి బెంగాల్‌లోని సిరంపూరు కేంద్ర బిందువయింది. బెంగాలి భాషతోపాటు పలుభాషా గ్రంథాలు, నిఘంటువులు, వ్యాకరణాలు ముద్రించి భారతదేశంతోపాటు చైనా, జపాన్‌ తదితర దేశాలకు ముద్రించిన గ్రంథాలు సరఫరా చేసిన ఖ్యాతి రెవరెండ్‌ విలియం కేరి (17.8. 1761 -9. 6. 1834)కే దక్కుతుంది. విలియం కేరీ: విలియం కేరీ ఇంగ్లండ్‌లోని పాలెర్‌ స్పరీ అనే గ్రామంలో ఎడ్మండ్‌ కేరీ, ఎలిజబెత్‌ దంపతులకు 1761 ఆగష్టు 17న జన్మించాడు. తండ్రి పల్లెటూరి పాఠశాల ఉపాధ్యాయుడు. కొంతకాలం నూలు వ్యాపారం, వస్త

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

3