పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యార్థులను వారి అభ్యసన పద్ధతులను జాగ్రత్తగా గమనిస్తే మనకొక సంగతి అవగతమౌతుంది. ఈ పిల్లల భాషా సామర్థ్యాలు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. తమది కానిభాషలో వీళ్ళు విద్యనేర్చుకుంటున్నారు. మాతృభాష ప్రభావం ఈ పిల్లల మాధ్యమ భాషమీద బలంగా పడుతున్నది. మాతృభాషలో ఉండే కల్పనలు విద్యాభాషమీద ఉండటంతో ఈ భాష పిల్లలకు క్లిష్టంగా మారింది. ఈ క్లిష్టత వారిలో న్యూనతకు కారణమౌతున్నది? (కారేపల్లి కబుర్లు 2012 పుట 39-40 ) ఇంత బాధపడిన ఈ అధ్యాపకుడు “లంబాడి గేయసాహిత్యం” చదివి కొన్ని పలుకుబడులైనా పాఠం చెప్పేటప్పుడు వాడుతుంటే పిల్లలు కొంతైనా అల్లుకుపోయేవారు. ముందుమాట 'ఏ టిచర్స్‌ డైరీలో కూడా “విద్యార్దుల భాషాసాంస్కృతిక సామాజిక నేపథ్యాల పట్ల అధ్యాపకులకు అవగాహన ఉండాలి , వారి పూర్వ జ్ఞాన పరిశీలన చేసి అంచనా వేయాలి” అంటూ చిలక పలుకులు వల్లించారు. జిల్లాలో జరిగే సైన్స్‌ ఫెయిర్‌లలో గానీ, వార్షికోత్సవాలలో గాని గిరిజనుల ప్రతిభలను ప్రదర్శించే కార్యక్రమాలను ప్రొత్సహించలేదు. పిల్లలు వాళ్ళ ఆట పాటలేవో వాళ్ళు ఆదుకునేవారు. వాటిని ఎవరూ పట్టించుకోలేదు.

ప్రభుత్వం చెక్కిన బొమ్మలు-మూసుకున్న దారులు.

పల్లెప్రజలు, ముఖ్యంగా గిరిజనులు, “చట్టాలకు, ప్రభుత్వానికి కట్టుబడి ఉండే సమాజంగా పరిణామం పొందుతున్నారు. ప్రభుత్వ కేటాయింపులపైనే ఆధారపడే తెగలుగా, శతాబ్టాలుగా ఉత్పత్తి రంగంలో నిలదొక్కుకున్న ఒక సమాజం, దయారహితంగా ఆ రంగం నుండి బహిష్మరింవబడి, ఎస్టేట్‌లలో బానిసలుగా కాని, ప్రభుత్వరంగం అట్టడుగుపొరల్లో గుమస్తాగా గాని రూపాంతరం చెందుతున్నారు” (కొండదొరసాని. సాహిత్య అకాడెమీ2011 పుట13)అంటూ ముందుమాటలో విచారపడుతూ వారు తమదైన కొత్తమార్గం వెతుక్కోవాలని ఉద్బోధిస్తారు.

దిద్దుబాటు చర్యలు -

అభివృద్ది వికటించి పర్యావరణం ఘోరంగా దెబ్బతినటంతో ప్రపంచమంతా దిద్దుబాటు చర్యలు మొదలైనాయి. 2003లో వచ్చిన జీవవైవిధ్య చట్టం వనరులమీది సంప్రదాయ జ్ఞానానికి పట్టం కట్టింది. అప్పటివరకు ఆక్రమణ దారుగా చూసిన ప్రభుత్వం, అడవిలో ఆదివాసుల వాడుకలను గుర్తించటానికి 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం తెచ్చింది. ఇందుకోసం ఆయా స్థూల 'పేర్లతో సంప్రదాయ గ్రామపటం గీసి, అక్కడి ఉమ్మడి వ్యక్తిగత వాదుకలు పేర్కొని దరఖాస్తుకు జతచేయాలి అని నిర్దేశించింది.

కాని చదువుకున్న ఉద్యోగం చేసే గిరిజనుల, అది అమలు చేసే అధికారుల మెదళ్ళు మూసుకుపోయాయి. వారికి గిరిజన సంస్కృతి యొక్క వ్యక్త రూపాలు స్థూల పేర్లు మెట్టలు, బసలు, బాసలు, కొత్తలు గుర్తుచేసే జ్ఞాపకాలు, సామెతలు పలుకుబడులు తట్టటం మానేసాయి. తలో దారిగా తూతూ మంత్రంగా వీటి అమలు జరుగుతుంది. జీవవైవిధ్య చట్టం ప్రకారం బీల, తంపర భూముల రక్షణకోసం ఉదృతంగా ఉద్యమం జరిగింది. ఎంతో సాహిత్యం వచ్చింది. కానీ వీటి నమోదు మాత్రం అంతంతగా సాగుతుంది. అందువల్లనేనేమో 'విష్లవాల సంగతి అటుంచి చిన్న చిన్న సంస్కరణలను కూడా సాహిత్యం చెయ్యలేదు( పుట 96) అని కొ.కు నిర్వేదం చెందాడు. సాహిత్యం, ముఖ్యంగా సాహిత్య విమర్శ ఆలోచన రగిలించాలి. మునుముందుకు నడిపించాలి అనే ఆశ అడియాసగా మారుతున్న తరుణంలో సహజవనరులపై ఆధార పడిన బతుకుతెరువుల మీద కృషి పాతదే అయినా కొత్తరూపాలలో కొత్త ఆశలు కల్పిస్తున్నది.

అయితే దళితులు, ఆదివాసీలు, బహుజనులు ఈ కృషిలో పాలుపంచుకున్నప్పుడే ఈ కృషి సఫలమౌతుంది. దానికి ఇంతకాలం చదివిన చదువుల, కొలువుల డొల్లతనం అర్దం కావాలి. ఈ చదువులు మాకొద్దు అంటూ వాళ్ళు మూలాలు వెతుక్కోవాలి.

సమరసతా నానీలు

నీలోని
నీవు కూడా నేనను
“భావం సమరసం”
ఇంటి పేరు
ఒక్కటయితే చాలు!
నా కులమని
సంబరమెందుకు?
కులవివక్షతలకి
విరుగుడు
విద్వేషమా?
సమన్వయమా?
అంబేద్మర్‌
అనుసరణీయుడే!
అనుచరుల
అడుగుజాడలే!?
మనువాదం లేదు
మనుషులమే
రాజ్యాంగమే
మనకు నేటి స్మృతి
కొంచెపుబుద్దితోనే
కొట్లాటలు
సమరసభావముతో
సమైక్యత
కులపొత్తు
వివాహం వరకు!
కులాలపొత్తు
సమత్వం కొరకు!
అహం వీడితే
అందరు మనవారే
అయినా 'నేను”
విడువలేక పోతున్నం
అనుబంధాలు
పల్లెటూరిలో...
నగరంలోనేమో
బంధనాలు.....
కలిసి నడుద్దామన్నది
మన వేదం
విడగాట్టటమే
కొందరికి మోదం
సమత్వం
సాధించాలనుకుంటే
సంఘర్షణ కాదు
సమన్వయం దారి
కులాల కొట్లాటలన్ని
ఒక్కరి వల్లే
ఆ ఒక్కరు “నేను "తో
సహజీవులే
వృత్తిని బట్టి
పుట్టింది..కులము
ప్రవృత్తిని బట్టి
ఉంటుంది.. గౌరవము
విడగొట్టటమే
కొందరి సిద్దాంతం
వేలెత్తామా!?
మళ్ళీ రాద్దాంతం
మహనీయులకి
కులం వెతకటం
ఆధునిక
యుగలక్షణం..
పూర్వీకులు
జ్ఞానానికి విలువనిస్తే
అనాగరికుల్ని
చేసింది చరిత్ర
మేధావులై
కులగజ్జి రుద్దటమే
నేటి ఆధునిక
డెమోక్రసీ...
పక్కవాడు తొక్కేయటం
పాతమాట
అంతకన్నా ప్రమాదం
ఆత్మన్యూనత
ఆత్మన్యూనత
ఒక్కరినే బంధిస్తుంది
అహంభావం
అందర్నీ కాల్చుతుంది
నేను “ఎక్కువ
అనుకున్నావా!
నీ ఎదుగుదల
నీవే అడ్డుకున్నట్లు!
సమతా హృదయం
సాధించాలంటే
సమరస
టానిక్‌ తాగాల్సిందే
సమాజవృక్షం
బలపడాలంటే
గుండేవేర్లని
సమరసంతో తడపాలి

- సాకి 9949394688

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

29