పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(కరించు) ధాతువుని నేరుగా చేర్చవచ్చు. ఈకరించు అవసరం లేదు.

ఉదా :- శాఖాకరించు (శాఖాకరణ), రేఖాకరించు (రేఖాకరణ), బాధాకరించు (బాధాకరణ) మొ॥

6. ఇకారాంత/ ఈకారాంత శభ్దాల విషయంలో కష్టమే లేదు. నేరుగా ఈకరించు అని చేర్చవచ్చు.

7. ఉకారాంత శబ్టాల విషయంలో వాటి చివఱి ఉకారాన్ని దీర్ఘం చేసి ఆ తరువాత దుక్ళఞ ధాతువునీ, ఇంచుక్‌ నీ చేర్చాలి.

1. ఉదాహరణకు :- అణువు = (n) atom అణు + కృ+ ఇంచుక్‌ = అణూ + కృ+ ఇంచుక్‌ =అణూకరించు (V) to atomise

దీని పదకుటుంబం ఇలా ఉంటుంది.

అణూకరణ = (n) atomization అణుకారి/ అణూకర్త = (n) atomizer (స్త్రీలింగం - అణూకారిణి) అణూకృతం/ అణాకారితం = (past participle) atomized అణూకరణీయం = (adj) atomizable వ్యతిరేకార్థకం - అనణూకరణీయం = (adj) non-atomizable అణూకరణీయత = (n) atomizability

2. పటువు = (adj) hard, strong, powerful, capable పటూకరించు = (V) to harden, to strengthen, to empower, to enable, to capacitate పటూకరణ = (n) hardening పటూకారి/పటూకర్త = (n) hardener (స్రీలింగం - పటూకారిణి) పటూకృతం/పటూకారితం = (past participle) hardened పటూకరణీయం = hardenable

వ్యతిరేకార్థకం - అపటూకరణీయం = (adj) un-hardenable పటూకరణీయత = (n) hardenability

3. మృదువు = soft, delicate, sensitie మృదూకరించు = to soften, to sensitie మృదూకరణ = (nl) softening మృదూకారి/ మృదూకర్త = (n) softener (స్రీలింగం - మృదూకారిణి) మృదూకృతం / మృదూకారితం - (past participle) softened మృదూకరణీయం - softenable వ్యతిరేకార్థకం - అమృదూకరణీయం = (adj) un-softenable మృదూకరణీయత = (n) softenability

4. హలంత శబ్ధాల్ని ఇలా సకర్మక క్రియాధాతువులుగా మార్చేటప్పుడు ఆ శబ్ధాలకి దుకృఞ (కరించు) ధాతువు నేరుగా వచ్చి చేఱుతుంది.

బలాత్‌ = బలంతో; బలాత్కరించు = ఒత్తిడిచేయు; సత్‌ = పండితుడు ; సత్కరించు = బాగా తెలిసినవాడనే గౌరవాన్ని చూపించు, సమ్మానించు, తిరస్‌ = వెనక్కి ; తిరస్మరించు = త్రిప్పిపంపు సాక్షాత్‌ = కట్టెదుట; సాక్షాత్కరించు = ఎట్టెదుట చూపించు, చీత్‌ = చీ; చీత్కరించు = ఛీకొట్టు

భవించు/ ఈభవించు

5. భవించు/ ఈభవించు అని చేర్చి నామవాచకాల్ని క్రియాపదాలుగా మార్చిన కొన్ని పూర్వోదాహరణలు ఈ క్రింద. భవించు అంటే అవ్వడం/ కావడం/ ఉండడం. ఉదా: మందం = నెమ్మది, మెల్లన; మందీభవించు = నెమ్మదించు, అంతర్‌ = లోపల; అంతర్భవించు = లోపల భాగంగా ఉండు, అప్రమేయంగా (తనంత తానే) ఉండు. to underlie. శీతలం = చల్లనిది; శీతలీభవించు = చల్లబడు. ఉష్ణం = వేడి; ఉద్ధీభవించు = వేడెక్కు ద్రవం = నీటివంటి పదార్థం; ద్రవీభవించు = నీటిలా పల్చగా ప్రవహించే తత్త్వాన్ని సంతరించుకొను

6. ఈ విధంగా నిష్పాదించిన క్రియాధాతువుల నుంచి ఉద్భవించే విస్తారమైన పదకుటుంబం ఇలా ఉంటుంది.

ద్రవం = (n) liquid ద్రవీభవించు = (V) to get liquefied = ద్రవంగా మారు ద్రవీభవనం = (n) liquefication = ద్రవంగా మారడం ద్రవీభావి = (adj) liquefier = ద్రవంగా మారే స్వభావం గలది (స్త్రీలింగం ద్రవీభావిని), ద్రవీభూతం = (past participle) liquified = ద్రవంగా మారినటువంటిది (పుల్లింగం ద్రవీభూతుడు) ద్రవీభవనీయం = (adj) liquefiable, వ్యతిరేకార్థకం = అద్రవీభవనీయం/ అద్రవనీయం = (adj) non-liquefiable

7. హాలంత శట్టాల్ని ఇలా అకర్మక క్రియాధాతువులుగా మార్చేటప్పుడు - ఆ శబ్ధాలకి భూ (భవించు) ధాతువు నేరుగా చేఱుతుంది. ఉదా :

ఆరాత్‌ = దగ్గఱ, ఆరాత్‌ + భవించు = ఆరాద్భవించు = దగ్గఱ అగు

సరిత్‌ = నది, సరిత్‌ + భవించు సరిద్భవించు = నదిలా మారు

'అభ్యాసకార్యములూ

ఈ క్రింది పదాల్ని క్రియాధాతువులుగా మార్చి వాక్యరూపంలో ఉదాహరణలివ్వండి :

1. విఫలం 2. జయప్రదం 3౩. ప్రముఖం 4 ప్రతినాయకుడు 5. మానవుడు 6. పశువు 7. ఆస్తికుడు 8. మృత్యువు 9. సాధువు 10. కార్యం 11. సత్యం 12. సేతువు: 13. వాజ్మయం 14. ఐతిహాసికం (చారిత్రికం) 15. గ్రామ్యం 16. వితథం (అబద్దం) 17. అధ్యాయం 18. సౌమ్యం 19. ధర్మం 20. తత్త్వం (philisophy). 21. సులభం 22. చిహ్నం 23. తేజస్‌/ తేజో 24. ఓజస్‌/ ఓజో (బలం) 25. మధువు 26. మరువు (మరుభూమి = ఎడారి) 27. హిమం 28. ప్రచురం 29. శ్వేతం (తెలుపు) 30. ధూసరం (grey) ౩1. అరుణం (ఎఱుపు) ౩2. లోహితం (ఎఱుపు) 33. పాటలం (గులాబీరంగు) 34 హరితం (ఆకుపచ్చ) 35. శ్యామలం (నలుపు) ౩6 గౌరం (పసుపు) ౩7. శ్యావం (brown) ౩8 సుగంధం 39. నిర్ణలం (నీళ్ళు లేనిది) 40. దరిద్రుడు 41. సంపన్నుడు. 42. విపణి. 43. సాయుధుడు 44. నిరాయుధుడు 45. నిఘంటువు 46. కోశం 47. వర్ణక్రమం (alphabetical order) 48. క్రమం (order) 49. పద్దతి (order) 50. వాహిని (channel). 51. పంజరం.

ఈ క్రింది ఆంగ్ల క్రియాధాతువులకి సరిసాటి అయిన తెలుగు-సంస్కృత పదాలు ఎంచుకొని క్రియాధాతువులుగా మార్చండి :

సూచన- ఉదా :- to represent - ఒకఱికి/ ఒకదానికి ప్రతినిధిగా ఉండు ప్రతినిధి + ఇల్లుక్‌ = ప్రతినిధిల్లు సూచన-2 : దీనికే ఇంచుక్‌ చేర్చి ప్రతినిధించు to delegate (ప్రతినిధిగా పంపు) అనే అర్థంలో ఇంకో క్రియా ధాతువుని సైతం నిష్పాదించవచ్చు. ఉదా :- ఐ.రా.స. సమావేశాలకి మా తరఫున ఇద్దఱిని ప్రతినిధించాం.

అంటే ఆ ఆంగ్ల క్రియాధాతువుకి ఏ ముఖ్యమైన తెలుగుపదంతో అర్ధం చెప్పుకుంటామో దాన్నే కొత్త క్రియాధాతువుగా

తరువాయి 41వ పుటలో.......

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

27