పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్తుంది. రచనాశీర్షికలు బారుబారుగా ఉండడం బావుండదు గనుకా, క్లుప్తంగా వ్రాయాలంటే సమాస ఘటన తప్పదు గనుకా, ఆ సమాసాల్లో పదబంథాలూ, శబ్దపల్లవాలూ ఇమడవు గనుకా, ఒక పదాన్ని క్రియాధాతువుగా మార్చి దాని భావార్ధకాన్ని (noun form) ఒక అవయవంగా సమాసంలో చొప్పిస్తారు.

ఉదా- రెండు దేశాలకీ మధ్య మళ్ళీ స్నేహం కలపడం అని శీర్షిక పెట్టాల్సి ఉందనుకోండి. ఇఱుదేశాల పునర్‌ మైత్రీకరణ అని పెట్టొచ్చు .

3. సదరు నామవాచకం తన అర్థం ద్వారా సూచించే వ్యక్తిగానో, వన్తువుగానో, పదార్థంగానో, లక్షణంగానో మార్చడాన్ని లేదా మారడాన్ని తెలియజేయడం కోసం క్రియాధాతువుగా మారుస్తారు.

ఉదా:- దైవం = దేవుడు, దైవీకరించు = దేవుణ్ణి చేసి పూజించు, పిండం = ముద్ద, పిండీకరించు = ముద్దగా చేయు, హేమం = బంగారం హేమీకరించు = బంగారుమయంగా చేయు, కఠినం = గట్టి, కఠినీకరించు = కఠినత్వమనే లక్షణాన్ని కలిగించు/సంతరించుకాను

ఉద్యానం - తోట, ఉద్యానీకరించు = తోటలాగా మార్చు ఉద్యానీకరణ - Landscaping (హరితీకరణ అని కూడా అనొచ్చు)

8. ఒక వస్తువుతో పోల్చడానికి ఆ వస్తువుని క్రియాధాతువుగా మారుస్తారు.

పర్వతం = కొండ (ఇక్కడ పర్వతం పోల్చబడే వస్తువు), పర్వతీకరించు = పర్వతంలా పెద్దదీ, గొప్పదీ చేసి మాట్లాడు, తృణం = గడ్డిపోచ (ఇక్కడ తృణం పోల్చబడే వస్తువు, తృణీకరించు =గడ్జిపోచతో పోలుస్తూ దానిలా (తక్కువగా) చూచు.

9. దేన్నయినా/ ఎవఱినైనా ఒకచోట ఉంచడం/ పెట్టడం అనే అర్ధంలో 'క్రియాధాతువుగా మారుస్తారు.

వశం = అదుపు, వశీకరించు = అదుపులో పెట్టు, ఉన్నతం = ఎత్తు, ఉన్నతీకరించు= ఎత్తులో / ఎత్తుగా పెట్టు (to eleate, to promote)


దూరం = దవ్వు, దూరీకరించు = దూరంగా పెట్టు ఈకరించు

ఈకరించు అని చేర్చి నామవాచకాల్ని క్రియాపదాలుగా మార్చిన కొన్ని పూర్వోదాహరణలు ఈ క్రింద.

ఆంధ్రము = తెలుగుభాష - ఆంధ్రీకరించు, వక్రము = వంకర - వక్రీకరించు, విద్యుత్‌ = Electricity - విద్యుదీకరించు, పట్టణము = Urban area = పట్టణీకరించు (to urbanise) క్రమబద్దము = regular - క్రమబద్ధీకరించు (to regularise) విపులము = వివరము - వివులీకరించు (to elaborate) విశదము = తేటతెల్లము -విశదీకరించు (to elucidate) అధునా = ఇప్పుడు, ఈ సమయము - ఆధునీకరించు (to modernize) ప్రమాణము =Standard - 'ప్రమాణీకరించు (to standardize) క్రోడము = ఒడి - క్రొడీకరించు (ఒళ్ళో పెట్టుకున్నట్లుగా ఒకచోట చేర్చుకోవడం) వాజము = ఱెక్క/వేగం - వాజీకరణం (వేగాన్ని పెంచే ఔషధం) సరళం = తేలిక -సరళీకరణం (simplification/liberalization) పరాయి = alien; పరాయీకరించు = పరాయిగా చేయు (alienate) పరాయీకరణ = alieanation మొ॥ కానీ అన్ని పదాలకీ “ఈకరించు” చేర్చడం సాధ్యం కాదు, ముఖ్యంగా ఆకారాంత, ఉకారాంత, యకారాంత శబ్టాలకి!

వివరణ :- ఉకారాంత శబ్జాలంటే పదం చివఱ 'ఉ/ ఊ” అని అంతమయ్యేవి.

ఉదా :- జిజ్ఞాసువు, పటువు, మధువు మొ౹౹వి.

1. వీటి చివఱి అచ్చుని దీర్ఘం చేసి కరించు అని చేర్చాలి.

అప్పుడు ఇలాంటివి - జిజ్ఞాసూ + కరించు, పిపాసూ + కరించు, జంతూ + కరించు, గురూ + కరించు, పటూ + కరించు, మథూ+ కరించు అనే విధంగా మారతాయి.

ఆకారాంత శట్టాలంటే పదం చివఱ 'ఆ” అనే ఉచ్చారణతో పలికేవి. ఉదా ఉదా:- లతా, ప్రక్రియా, శాఖా, రేఖా మొ౹౹వి.

యకారాంతాలంటే పదం చివఱి 'య” అనే అక్షరం గలవి. ఉదా :- సమయం, వాజ్మయం, కార్యం మొ॥వి.

9. ఆకారాంత, యకారాంతాలకి చివఱ 'ఆపించు”'అని చేర్చి వాటిని క్రియాధాతువులుగా పరివర్తించవచ్చు. ఉదా:

ప్రక్రియ = (n) process ప్రక్రియాపించు - (U) to process ఉదా :- ఆంధ్రాలో ఆహారాన్నీ ప్రక్రియాపించే పరిశ్రమలు హెచ్చు. (Food-processing units abound in Andhra)

3. ఒకసారి ఇలా ఒక కొత్త క్రియాధాతువుని నిష్పాదించినాక, దాని నుంచి ఉద్భవించే విస్తారమైన పదకుటుంబం ఇలా ఉంటుంది.

పక్రియాపన = (n) processing ప్రక్రియాపకం = processor (ఉదా:- పదప్రక్రియాపకం = Word-processor ప్రక్రియాపక పరిశ్రమ = processing industry ప్రక్రియాపితం = processed (ఉదా:- ప్రక్రియాపిత ఆహరం = processed food) పక్రియాపకుడు = process maker ప్రక్రియాపనీయం = processable, processing-worthy ప్రక్రియాపనీయత = processability అదే విధంగా

సమయం = (n) time సమయాపించు = (U) సమయాన్ని ఏర్పఱచు to set a time, to schedule something as to occur at a particular time సమయాపన (n) ఉదా :- ఈ టపాని వచ్చే వారానికి సమయాపించాను - hae scheduled this post for the next week.

శాఖ = (n) a branch శాఖాపించు = (U) శాఖగా ఏర్పాటు చేయు, శాఖగా ఏర్పాటగు to set up a branch, to branch out శాఖాపన (n) = branching out ఉదా :- ఆ వ్యాపారం ఆంధ్రా అంతటా శాఖాపించింది (శాఖలుగా విస్తరించింది.) - The business branched out all oer Andhra.

4. “ఈకరించు” చేర్చాల్సిన అన్నిచోట్లా మఱోక అర్థంలో కావాలనుకున్నప్పుడు “ఆపించు” అని చేర్చవచ్చు.

ఉదా :- సామాన్యీకరించు అనేది to generalize అనే అర్ధంలో వాడబడుతోంది. ఇది సామాన్య శబ్టానికి ఈకరించు అని చేర్చడం ద్వారా ఏర్పడింది. కానీ ఒక సందర్భంలో అదే సామాన్యశట్టాన్ని ఉపయోగించి మనం ఇంకో అర్థంలో ఒక కొత్త క్రియాధాతువుని నిష్పాదించాలనుకున్నాం. అప్పుడు

సామాన్యాపించు - (V) to reduce someone or something to common leel; to apply something commonly to all. సామాన్యాపన (n) - ఇవి నేనిచ్చిన అర్ధాలు.

5. ఆకారాంతశబ్టాల్ని క్రియాధాతువులుగా మార్చడానికి డుకృణ్‌

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

26