పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాటల నిర్మాణం

వాచస్పతి

(గత సంచిక తరువాయి...)

పదనిష్పాదనకళ

The joy of coining new words

అయిదో అధ్యాయం

సంస్కృత పదప్రత్యయాల సహాయంతో క్రియాకల్చన పద్ధతులు

సంస్కృత పదాలకి ఇంచుక్‌ చేఱే విధానం మనకందఱికీ కొద్దొ గొప్పో తెలుసు కనుక సవిస్తరంగా ఆ- జోలికిపోను. విశేష వివరణలు కావాల్సినవారు చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణంలోని క్రియా పరిచ్చేదం చదవండి. ఐతే ప్రస్తుతం ఈ మార్గంలో కూడా అవసరమైన పదాల కల్పన జఱగడంలేదు. దీనికి సామాజిక కారణాలున్నాయి.మన సమాజంలో సంస్కృత భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఒక ప్రత్యేక సామాజిక జనాభాకే పరిమితం. మిగతా ప్రజలకి సంస్కృతంతో సంపర్కమెప్పుడూ లేదు. ఇప్పుడు ఆ జనాభా ఆంగ్ల విద్యాపారీణమైంది. తత్ఫలితంగా మనం గతం నుంచి సాంస్కృతిక తెగతెంపులకి గుఱెన అపస్మారకపు చారిత్రికదశలో బతుకుతున్నామేమో ననిపిస్తుంది. మనం ఆంగ్ల పదాలకి దీటైన దేశిపదాల్ని పట్టుకోవడంలో విఫలమవుతున్న దశా పరిణామం గోచరిస్తోంది. ఇక్కడ కొంత ప్రదర్శించడం జఱుగుతోంది. ఈ ఒఱవడినే మిగతా పదాలకి సైతం అనువర్తించి ప్రయత్నించవచ్చు,

ఉదా:- పుస్తకం (book) - పుస్తకించు (booking) వీణ్ణి జేబుదొంగగా పుస్తకించంది. (నమోదు చెయ్యండి. Book him as a pickpocket}


మార్గం (route) - మార్గించు (routing) పేపాల్‌ ద్వారా ఈ చెల్లింపుని మార్గించాను (మార్గం కల్పించాను) = పేపాల్‌ పద్దతిలో (మార్గంలో) ఈ చెల్లింపుని పంపించాను. (I routed this payment through Paypal)


“ఇంచుక్‌' ఉపయోగించి ప్రసిద్ద సంస్కృత వ్యక్తుల/దేవతల పేర్లని కూడా క్రియాధాతువులుగా మార్చొచ్చు. అలాంటివి ఒకటి రెండు ఇప్పటికే సుప్రసిద్దం. ఉదా : భీష్ముడు - భీష్మించుట, శివాలెత్తుట మొ.

మఱికొన్నింటి క్కూడా అవకాశముంది. కాని అలాంటి క్రియాధాతువులు అర్ధం కావాలంటే వారి గుణగణాలు కొంచెమైనా తెలియాలి. చరిత్రలో కొందఱు వ్యక్తులు చేసిన పనులు వారి మనస్తత్వానికి అద్దంపట్టుతాయి. ఆ మనస్తత్వాన్ని అనుసరించి చేసే పనుల్ని వర్ణించడానికి వారి పేరుమీద క్రియాదాతువుల్ని కల్పించవచ్చు. ఉదా :

విక్రమార్కించు = పట్టువదలకపోవు, జయచంద్రించు =స్వదేశీయులకు ద్రొహం చేసి విదేశీయులకు తోడ్పడు, కుంభకర్ణించు= లోకోత్తరంగా నిద్రపోవు మొదలైనవి.

మన పూర్వీకులు కేవలం సంస్కృత క్రియాధాతువులనే తెలుగులోకి తేలేదు. వారు సంస్కృత నామవాచకాల నెన్నిటినో కూడా తెలుగు క్రియాధాతువులుగా పరివర్తించారని గమనించాలి.

ఈ క్రిందిపదాలు పరిశీలించండి :

అంకురం - అంకురించు; అంజలి - అంజలించు; అంతరము- అంతరించు; అనుకూలం - అనుకూలించు; అలసం (ఆలస్యం)- అలసించు; అసహ్యం - అసహ్యించుకొను; ఆశ - ఆశించు, ఆర్భటి - ఆర్భటించు; కటాక్షం - కటాక్షించు; కబళం - కబళించు; కరుణ - కరుణించు; కష్టం - కష్టించు; కుసుమం - కుసుమించు; గోచరం - గోచరించు; గౌరవం - గౌరవించు; జన్మ - జన్మించు ;చిత్రం - చిత్రించు; తటస్థము - తటస్థించు; తామసం -తామసించు; తీవ్రం - తీవరించు; నిర్మూలం - నిర్మూలించు; నీరసం- నీరసించు; పరమపదం - పరమపదించు; పరిపాటి - పాటించు; ప్రగల్భాలు - ప్రగల్బించు; ప్రతికూలం - ప్రతికూలించు; ప్రతిబింబం- ప్రతిబింబించు; ప్రపంచము - ప్రపంచించు; పురాణం -పురాణించు; బద్దకం - బద్దకించు; మూర్ఖుడు - మూర్థించు; యోగం- యోగించు; వల్లి (ఉపనిషత్తులలోని శీక్ల్షావల్లి, ఆనందవల్లి మొదలైన అధ్యాయాలలోని మంత్రాల పఠనం) - వల్లించు; విగ్రహం(పోట్లాట) - విగ్రహించు; విషమం - విషమించు; విహ్వలము - విహ్వలించు; శృంగారం - శృంగారించు; శుష్కం - శుష్కించు; సమీపం - సమీపించు; సాహసం - సాహసించు; స్వాగతం - స్వాగతించు; హేమం - హేమించు మొ

ఇవేవీ సంన్క్సృతంలో క్రియలుగా వాడరు. కానీ తెలుగుపూర్వీకులు సాహసించారు. వీటిల్లొ నామవాచకాలే కాక అనుకూలం, గోచరం, విషమం, విహ్వలం, అసహ్యం, సమీపం లాంటి విశేషణాలు తూడా ఉన్నాయనేది అవదేయం. దుర దృష్టవశాళత్తూ ఆ చొఱవ ఈ తరంలో లోపించి పదసృష్టి ఆగిపోయింది. ప్రయత్నించాలే గానీ ఇప్పుడు కూడా ఈ బాటలో పదాల్ని నిష్పాదించే అవకాశం ఇతోధికంగా ఉంది.

'1. ఇలాంటి పదాల్ని క్రియలుగా మార్చేటప్పుడు సర్వ సాధారణంగా చివఱా 'ఈకరించు” అని చేఱుస్తారు. అలా కాకుండా నేరుగా వట్టి “ఇంచుక్‌' చేర్చడం ద్వారా కూడా క్రియాధాతువుల్ని నిష్పాదించే వీలుందని పై ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.

నామవాచకాల్ని క్రియాధాతువులుగా మార్చడం : ఎందుకు ? ఏమిటి ? ఎలా ?

ఒక నామవాచకాన్ని క్రియాధాతువుగా మారుస్తున్నామంటే అలా ఎందుకు మారుస్తున్నామో మనలో ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అసలు అలా మార్చే అవసరం దానంతట అది కలగాలి. అలా మార్చడం ద్వారా మనం ఏ విధమైన కొత్త అర్దాన్నీ వ్యంగ్యధ్వనినీ ఉద్దేశిస్తున్నామో ముందు మనకొక అవగాహన ఉండాలి. సరైన లక్ష్యశుద్ది లేకుండా ఊరికే ప్రతి నామవాచకాన్ని క్రియాధాతువుగా మార్చడం వల్ల వచ్చిపడే అదనపు అభివ్వక్తి సౌలభ్యమేమీ లేదు.

1. సాధారణంగా ఒక పదబంధం (phrase)తో గానీ, శబ్ధపల్లవం (idiom) తో గానీ బారుబారుగా చేసే వ్యక్తీకరణలను ఒక్కపదంగా కుదించడం కోసం మారుస్తారు.

ఉదా :- తెలుగులోకి అనువదించాడు = తెనిగీకరించాడు. ఘనపదార్థంలా గట్టిగా మారింది = ఘనీభవించింది.

9. కొన్నిసార్లు రచనలకి శీర్షికలుగా సమాసాల్ని పెట్టాల్సి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

25