పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏం జరిగేదో బిలాల్‌ మాటల్లో విందామా?

వెంటనే మనం ఓ నిపుణుల కమిటీ వేసేవాళ్ళం. భాషా నైపుణ్యాల్ని వాళ్ళు విశ్లేషించేవారు. ఎన్నిరకాల నైపుణ్యాలుంటాయో లెక్క తేల్చేవారు.

పిల్లలు ఏ భాష నేర్పు కోవాలో ఆ భాషా పదాలు నేర్చుకోవాలంటే ముందు ధ్వనులు పలకడం రావాలి కదా! ఆ తర్వాత గదా మాటలు.

ఆ ద్వనుల్ని మళ్ళీ సులభమైనవి, సర్వసామాన్య మైనవి అని విభజించేవాళ్ళు. అప్పుడు మనం ముందు సులభమైన ఈ ధ్వనులు నేర్పి ఆ తర్వాత కష్టమైనవి, అరుదైనవి నేర్పించే వాళ్ళం.

పిల్లలు గందరగోళ పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇతర ధ్వనులేవీ వాళ్ళకి వినబడకుండా చేసేవాళ్ళం. సాధారణ సంభాషణల్ని వింటే బూతుపదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి వీలున్నంత దూరంగా ఉంచేవాళ్ళం. మనం నేర్చదల్భుకొన్న ధ్వనుల్ని మాత్రం బాగా మార్మారు వినబడేలా ఏర్పాట్లు చేసే వాళ్ళం.

ఆ తర్వాత గుణింతాలు అక్షరాల్ని పలకడం నేర్చేవాళ్ళం. అందుకోనం రకరకాల థ్వనుల్ని కలిపి లిష్తు తయారు చేసుకొనేవాళ్ళం. వాటితో వచ్చే పదాలతో ఆ తర్వాత లిస్టులు తయారుచేసేవాళ్ళం. మరి పదాలు రాగానే సరిపోయిందా? వాటిని కలిపి వాక్యాలు తయారు చెయ్యాలిగా. అందుకోసం వ్యాకరణం ముందు ఎక్కించే వాళ్ళం. హమ్మయ్య వ్యవహారం ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది, అనుకొని తర్వాత పనికి ఉపక్రమించేవాళ్ళం.


ఇంక చేయాల్సిందంతా డ్రిల్లింగు, అప్పుడప్పుడూ సమీక్షలు, మరిచిపొయ్యారో ఏమో తెలుసుకొనేందుకు వీలున్నన్ని సార్లు పరీక్షలు.

ఆహా! ఇప్పుడేమవుతుంది? ఏమయ్యేదేముంది తొంభై శాతం పిల్లలు ఈ గొడవ పడలేక, అడుగడుగునా వణికి పోలేక పారిపోతారు. (పారిపోయి ఎంచక్కా వాళ్ళింట్లో, పరిసరాల్లో, ఆటల్లో, పనుల్లో మాట్లాడ్డం వింటారు. హాయిగా ధారాళంగా మాట్లాడ్డం నేర్చేసు కొంటారు) లేకుంటే మూగ మొద్దుల్లా తయారవుతారు. ఇప్పుడు చెప్పండి,

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? మనమెలా నేర్చాలనుకొంటున్నాం?

జాన్‌ హొల్ట్‌ అమెరికాకు చెందిన గొప్ప విద్యావేత్త అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా పని చేశారు. పిల్లలు ఎలా నేర్చుకొంటారో, నేర్చుకోవడంలో ఎలా విఫలం అవుతారో పిల్లలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అనేక రచనలు చేశారు. సరిగ్గా నేర్చుకోడానికి నేటి విద్యావ్యువస్థ పని చేయదని తేల్చి చెప్పాడు. ఒక పత్రిక ప్రారంభించి పాఠశాల లేకుండా నేర్చుకోవాలనో ఉద్యమం నడిపాడు. 1923లో జన్మించిన హొల్ట్‌ 1985లో మరణించాడు.

ఈ వ్యాసం వియన్నార్‌ బుక్‌ వరల్డ్‌ ప్రచురించిన వ్వాస సంకలం నుండి గ్రహింపబడినది. ఈ సంకలనం,

అనుసృజన వి. బాలసుబ్రహ్మణ్యం గారు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

24