పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినడానికి వింతగా ఉంటుంది కదా. బహుదాన్యపురం, పౌదన్యపురం అని చెక్కింపు(శాసనా)లలో ఉందట. ఈ సంసుక్రతపు పేర్లు కాకుందా, దానికి తెలుగుకుదురు ఏదయినా ఉంటుందంటావా?” నడుమన దూరుతూ అడిగినాడు నారాయణ.

“తెలుసుకోవలసిన అడకనే అడిగినావు కానీ దీనిని విడమరచి చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. అయినా కుదింపుగా చెపుతాను విను. బారతనాడులో తొలిమినుకు(రుగ్వేదం) వెలువడిన నాటికే పలునుడులు ఉనికిలో ఉన్నాయి. తెనుగు (మూలద్రావిడం) వాటిలో ఒకటి. తొలిమినుకు మీద తెనుగు వెలుగులు పడిన ఆనవాళ్లు ఉన్నాయి. తెనుగు ఆనాటికే నాగరికనుడి. హరప్పావంటి పేటలను కట్టుకొన్న నుడి. ఎంతో ఎడంగా ఉన్న గ్రీకు, సుమేరియన్లతో కవరం (వ్యాపారం) సాగించిన నుడి. కవరం కోసం కడళ్లనే దాటిన నుడి. అంతగా ఎదిగి ఉన్నది కాబట్టే తొలిమినుకు మీదనే దీని వెలుగు పడింది. తొలిమినుకులో ఉన్న నుడి పేరు వైదికం లేదా చాందసం. చాలామంది పొరపాటుగా దానిని సంసుక్రుతం అనేస్తుంటారు. చాందనం,తెనుగు వంటి ఒకటి రెండు నుడుల కలయికతో తావుతావుకూ కొంగొత్త గొంతులు వెలువడినాయి. వీటిని ప్రాక్రుతాలు అన్నారు. 'ప్రాక్రుతాలన్నిటికీ 'పెనునుడి ఒకటి కావలసి వచ్చింది. అందుకనే అప్పటి తెలివరులు, చాందసనుడిని ఆనుగా చేసికొని, తెనుగునుండి ఎన్నో మాటలను కలుపుకొని సంసుక్రుతాన్ని కట్టినారు. సంస్కరించి కట్టిననుడి కాబట్టే దానికి సంసుక్రుతం అనే పేరు వచ్చింది. కడలినీ కప్పళ్లనీ ఎరుగని చాందసనుడికీ, తెనుగునుండి ఎన్నో మాటలను కలుపుకొన్న సంసుక్రుతానికీ ఎంతో వేరిమి ఉంది. తెనుగునుండి తెలుగు విడివడినాకనే సంసుక్రుతవు కట్టుబాటు జరిగింది. అందుకే తెలుగు ఆనవాళ్లు సంసుక్రుతంలో చాలా కనిపిస్తాయి. తరిపోకడలో తెలుగుమీద చీకటికమ్ముకొని, అన్ని మాటలూ నంసుక్రుతం నుండే పుట్టి నాయి అనే అనిపింపు గట్టిపడిపోయింది. అటువంటి మాటలలో పోత,ఓడ, దోనె వంటివి ఉన్నాయి. ఇవన్నీ తెలుగునుండి వెళ్లినవి. కానీ మన నుడిగంటులలో మట్టుకు దిగుమతి అయినవిగా కనబడుతాయి. 'పొత ' పుట్టుక గురించి అమరకోశంలో ఏ విడమరపూ లేదు. పోత తెలుగుమాూట. దీనికి ముందు రూపు 'పొంత '. 'పాన్‌ ' అనే తెలుగుకుదురుకు కలయిక అని తెల్లం. పొందు,పొత్తు, పొంతకుండ, పొంగలి వంటి మాటలలో ఇది కనబడుతుంది. కొయ్యాకొయ్యా కలిసి ఏర్పడేది పొంత. దాని మరుపొడే పోత. పోతల మీద ఏరులను గడచి కదలిని చేరి ఓడలమీద దవ్వులకు చేరేవారు. ఓడలలో కప్పళ్లలో తెచ్చిన సరకును, పోతలమీదా పడవలమీదా లోతట్టుకు సాగించి కవరం చేసేవారు తెలుగువాళ్లు. అట్ల కవరం జరిగిన చోట్ల పేటలు ఏర్పడినాయి. వాటిపేర్లు కొన్ని 'పోత” తో మొదలయినాయి. పోతులూరు, పొందూరు, పోతనూరు, పొద్దటూరు, వంటివి అవి. బోదన కూడా అటువంటిదే. బట్టిప్రోలు చెక్కింపులో కూడా “పోత” అనేపేరు తగులుతుంది. బోర్లించిన పోత అడపొడలో కొన్ని గుడుల పైకప్పులను కట్టుకాన్నాడు తెలుగువారు. ఇది తెలియక ఇప్పటి తెలివరులు వీటిని 'గజప్పష్టం” అంటున్నారు. ఎంతో పాతదైన 'కపోత ఈశ్వర ' గుడిపేరులో కూడా పోత ఉంది. ఇటువంటి తెలుగు మాటలు నూర్లు వేలు మరుగున పడిపోయినాయి. ఈనాటికి, తెలుగువాళ్లకు ఏమీ చేతకాదు అని ఇరుగుపొరుగు వారు చాటుతుంటే, అవును అది నిక్మమే అని మనం తలలూపుతున్నాం” అంటూ నారాయణ అడకకు మారాడినాను.

“అన్నయ్యా, ఆ రెండో చేర్చును చెప్పన్నయ్వా” బతిమిలాడినాడు చిన్నయ్య.

“చెప్తతున్నా ఆ చేర్పు 'ఏగి. తెన్నాడులోని చోళనాడు తావున తెలుగువారు ఇప్పటికీ వాడుతున్న మాట ఇది. చోళనాడు తెలుగులో వాహనాన్ని 'ఏగి” అంటారు. 'ఏగు” అనే పనిపలుకు అన్నిచోట్లా వాడుకలో ఉన్నదే కదా. 'ఏగు” అంటే వెడలు, కదలు అని తెల్లం. ఏగేది ఏగి అయి ఉంటుంది. ఈ మాటను చేర్పుగా చేసికొని మనం కొత్త మాటలను పుట్టించవచ్చు. చూద్దాం రండి”

1. అద్దె+ఏగి అద్దేగి టాక్సీ
2. కోయు+ఏగి. కోతేగి హార్వోస్టర్‌
౩. చదును+ఏగి చదునేగి రొడ్ రొలర్ మ
4. జల్ల +ఏగి జల్లేగి ట్రక్‌వెహికల్‌ ..............
5. తవ్వు+ఏగి తవ్వేగి ప్రొక్లెయినర్‌ .............
6. తాను+ఏగి తానేగి ఆటోరిక్షా తానుగా ఏగేది. ఆటో=తనకుతాను
7. తూను+ఏగి... తూనేగి హెలీకాష్టర్‌ తూను=సాగు, ఎగురు; తూనీగ= ఎగిరేఈగ
8. తేరు+ఏగి తేరేగి కార్‌ కార్‌ అనేమాట చారియట్‌ నుండి పుట్టింది.
చారియట్‌ అంటే తేరు. తేరు వంటి ఏగి తేరేగి.
9. తొట్టి +ఏగి తొట్టేగి టాంకర్‌
10.తోయు+ఏగి తోయేగి డొజర్
11.దుక్కి+ఏగి దుక్కేగి ట్రాక్టర్‌; ట్రాక్‌=చాలు; దుక్కి=నాగటిచాలు
12. నీరు+అడుగు+ఏగి నీరడుగేగి సబ్‌మెరైన్‌ జలాంతర్జామి అంటున్నారు
13.నొగులు+ఏగి నొాగులేగి ఆంబులెన్స్‌ నొగులు=డిసీజ్‌
14 పట్టె+ఏగి పట్టేగి ట్రైన్ప పట్టెలమీద వెళ్లేది
15. పాడె+ఏగి పాడేగి. ... శవయాత్ర వాహనం అంటున్నారు
16. పేరు +ఏగి పేరేగి బస్‌ బస్ అనే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

21