పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంతెన బండి ఇరుసూ గానులూ మెత్తగిల్లడానికి అంటే కందడానికి వాడే ఎన, కందు+ఎన=కందెన ఇవి కొన్ని మచ్చులు. వెతుక్కొంటే మరిన్ని మాటలు దొరుకుతాయి. ఎనతో ఎన్నలేనన్ని మాటలను పుట్టించవచ్చు. మచ్చుకు కొన్నిటిని పుట్టిద్దాం” అంటూ మొదలు పెట్టినాను.

1. అరుచు+ఎన అరపెన లౌడ్ స్పీకర్‌
2. అర్చు+ఎన ఆర్పెన డ్రైయర్‌
3. ఈద+అదుపు+ఎన ఈదదుపెన ఏ.సి. ఈద =గాలి.
4. ఉజ్జు+ఎన ఉజ్జెన మాబ్‌ ఉజ్జు=తుడుచు.
5. ఉతుకు+ఎన ఉతుకెన వాషింగ్‌మెషిన్‌ .....
6. ఉలివు+ఎన ఉలివెన సౌండ్ బాక్స్‌ ఉలివు=సౌండ్.
7. ఎంచు+ఎన ఎంపెన కాలిక్యులేటర్‌
8. ఎత్తు+ఎన ఎత్తెన లిఫ్ట్‌
9. ఎనిక+ఎన ఎనికెన కంప్యూటర్‌
ఎనిక=లెక్క సంగణక యంత్రం అంటున్నారు.
10. ఒత్తు+ఎన ఒత్తెన ఐరన్‌బాక్స్‌ .....
11. ఒరయు+ఎన ఒరయెన టెస్టర్‌ ఒరయు=టెస్ట్‌చేయు
12. కడుగు+ఎన కడుగెన వాషర్‌
13. కలుపు+ఎన కలుపెన మిక్సర్‌
14. కాచు+ఎన కాపెన గీజర్‌
15. కుందు +ఎన కుందెన కుర్చీ/చెయిర్‌
కుందు =కూర్చొను; వీల్‌ చెయిర్‌ =గానుకుండెన: ఈజీ చెయిర్‌ =వాలుకుండెన
చెయిర్‌ పర్సన్‌ =కుండెనరి.
16. కుమ్ము+ఎన కుమ్మెన ఒవెన్‌: కుమ్ము=వేడి నిప్పులు;కుంపటి =వేడినిచ్చేది;
కుమ్మెన=వేడిచేయడానికి వాడేది
17. కోయు+ఎన కోతెన హార్వెస్టర్‌
18. గొరుగు+ఎన గొరుగెన రేజర్‌
19. చలవ+ఎన చలవెన కూలర్‌
20. చివ్వు+ఎన చివెన పీలర్‌
21. తుడుపు+ఎన తుడుపెన ఎరేజర్‌
22. తురుము+ఎన తురుమెన గ్రేటర్‌
23. తెంచు+ఎన తెంపెన. కట్టర్‌
24. (తొల)చూపు +ఎన (తొల)చూపెన టెలివిజన్‌; తొల=దూరం; తొలగు=దూరమగు;
తొలగా ఉన్నవాటిని చూపునది తొలచూపెన. చిన్నదిగా చూపెన అని పిలచుకోవచ్చు. దూరదర్శన్‌ అంటున్నారు.
25.దంచు+ఎన దంపెన మిక్సీ
26. దుమ్ము+ఎన దుమ్మెన డస్టర్‌; దుమ్మును దులిపేది
27. దొరల్చు+ఎన దొరల్బెన కన్వర్దర్‌
28. నింపు+ఎన నింపెన ఫిల్లర్‌
29. పలుకు +ఎన పలుకెన ఫోన్‌;

టెలిఫోన్‌కు దూరవాణి అని వాడుతున్నారు. ల్యాండ్‌ ఫోన్‌కు స్తిరవాణి అని మొబైల్‌ఫోన్‌కు చరవాణి అనీ వాడుతున్నారు. ఫోన్‌కు, ఎనను చేర్చకుండా “పలుకి అనడం తెన్నాటి తెలుగువాళ్ల వాడకం. నేలపలుకి, అలపలుకి అనేవి కూదా. 'ఫోన్‌ చేసినారా అనడాన్ని 'పిలిస్తిరా అనడం, మిస్ట్‌కాల్‌ను 'దూసుపిలుపు” అనడం, తెన్నాట్‌ తెలుగు వాడకం.

30. పొదువు+ఎన ఫొదువెన రికార్డర్‌; పొదువుకొనేది.
31. పొల్లు+ఎన పొల్లెన సూయింగ్‌మెషీన్‌; పొల్లు = కుట్టు. కుట్టెన అనికూడా వాడవచ్చు.
32, పోజు+ఎన పోజెన ప్యూరిఫైయర్‌; పోజు= శుబ్ర పరచు.
33. మరతిప్పు+ఎన మరతిప్పెన స్క్రూడ్రేవర్‌
34. మార్చు+ఎన మార్పెన.... ట్రాన్స్‌ఫార్మర్‌; నియంత్రిక అని వాడుతున్నారు.
౩5. రుద్భు+ఎన రుద్దెన స్మబ్బర్‌ _.....
36. రుబ్బు+ఎన రుబ్బైన గ్రైండర్‌
37.వండు+ఎన వండెన కుక్కర్‌
38. వడ +ఎన వడెన ఫ్రిజ్‌; వడ =గట్టకట్టిన మంచు
39. విత్తు+ఎన విత్తెన సీడర్‌
40.వీయు+ఎన వీవెన ఫ్యాన్‌ .....
41. వెచ్చ+ఎన వెచ్చెన హీటర్‌ ....
42, వెలచు+ఎన వెలపెన ఫిల్టర్‌; వెలచు =వడకట్టు

“ఇట్లా ఎన్నో మాటలను పుట్టించవచ్చు. చిక్కుతీసే ఎన ఉంటే చిక్కెన. కలుపుదోకే ఎన దోకెన. చెక్కేది చెక్కెన. తిరిగేది తిరుగెన. చుట్టేది చుట్టెన. పిండేది పిండెన. నొక్కేది నొక్కెన. ఒలిచేది ఒలుపెన. కొలిచేది కొలుపెన. వేల ఉరువులు కొంగొత్తవి వచ్చినా ఈ ఎనతో వాటికి తెలుగుపేర్లను పెట్టవచ్చు. తెలుగు చేవగల నుడి. దానిని వాడుకొనే చేవ తెలిసుండాలి అంతే” అంటూ ముగించినాను.

“అన్నయ్యా, బొదన్‌ శౌరీలమ్మ, పిల్లలకు నేర్చిన రెండో చేర్చును గురించి చెప్పవా” అడిగినాడు చిన్నయ్య.

“నాకొక అరగలి(సందేహం) అన్నయ్యా,బోదన్‌ అనే పేరు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

20