పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తమాట

స.వెం.రమేశ్‌

కొత్తమాటల పుట్టింపు

7

“అన్నయ్యా, పిండిని రుబ్బే గైండర్‌ను రుబ్బురోలు అని పిలుచుకోవచ్చుగా. మనకు ఉన్న తెలుగుమాటలకు మారుగా కొత్త మాటలను పుట్టించడం ఎందుకు?” అన్నాడు చిన్నయ్య.

“రుబ్బురోలును చేత్తో తిప్పుతాం. గైండరును మించు(విద్యుత్‌) తో తిప్పుతాం. అవి చేసే పనులు ఒకటే కావచ్చు కానీ, వాటి అడపొడ(ఆకారం)వేరువేరు. కాబట్టి గైండర్‌కు కొత్తమాటను పుట్టించితేనే బాగుంటుంది. కదూ అన్నయ్యా” చెప్పినాడు నారాయణ.

“అలాగయితే మన పాత తెలుగుపేర్లన్నీ పోయినట్లేగా. ఆ పేర్లతోపాటు ఆపేర్లకు చెందిన పనిపలుకులూ పోయినట్టేగా. రుబ్బురోలు అనే మాటను వాడడం చిన్నతనం అయిపోయి, గైండర్‌ అనే మాటను వాడుతున్నాం. రుబ్బురోలుతోపాటు రుబ్బడం అనే పనిపలుకూ పోయింది. గ్రైండ్‌ చేయడం అనేది వాడుకయింది. మిక్స్‌ చేయడం, వాష్‌ చేయడం, కుక్‌ చేయడం, కట్‌ చేయడం.... వంటివి కోకొల్లలుగా వచ్చేసినాయి. పనిపలుకులు పోవడం నుడికి పెనుముప్పని నువ్వే అంటుంటావుగా అన్నయ్యా” అంటూ అంగలార్చినాడు చిన్నయ్య, ఇక నేను కలిపించుకోక తప్పలేదు.

“చిన్నయ్యా, నీ అలమట నాకు ఎరుకపడింది. నువ్వు కాస్త గందరగోళంలో ఉన్నావు. రుబ్బురోలు, గ్రైండర్‌ మట్టుకే కాదు. ఎన్నో ఉరువు(వస్తువు)లు వాటి అడపొడను మార్చుకొని కొంగొత్త జాడలతో మనముందుకు వచ్చినాయి, వస్తున్నాయి కూడా. నారాయణ చెప్పినట్లు కొత్త అడపొడకు పాతపేరును మనవాళ్లు ఒప్పుకోరు. అలా పుట్టించినపుడే, వాటికి చెందిన పనిపలుకులు కూడా మనగలుగుతాయి. కొత్తమాటలు రాకపోతే పాతమాటలను వాడడానికి ఇచ్చగించక పెరనుడి మాటలనే తీసుకొని వాడేస్తారు. కాబట్టే కొంగొత్త ఉరువులకు కొత్తమాటలు కానే కావాలి” అన్నాను.

“ఎన్ని కొత్త ఉరువులు వచ్చినా కొత్తమాటల్ని పుట్టించగలమా?” అడిగినాడు చిన్నయ్య.

“అలా పుట్టించగలిగేదే కదా చేవయిన నుడి. ఇన్నాళ్లూ అన్నయ్య దగ్గరుండి నువ్వు నేర్చుకొన్నది ఇంతేనా. అన్నయ్య తలచుకొంటే వేలమాటలను పుట్టించగలడు” అన్నాడు నారాయణ.

చాలు నారాయణా, నీ పొగడ్తలను ఆపు. నన్ను పొగడడం అంటే, నాకాళ్లకింద గోతిని తీయడమే. వేలమాటలను నేనే కాదు, నువ్వయినా చిన్నయ్యయినా ఇంకెవరయినా కూడా పుట్టించవచ్చు. అది మన తెలుగుకున్న చేవ. మీకొక మందలను చెపుతాను వినండి. తెలంగాణలోని బోదన్‌లో పూదోట శౌరీలు అనే పంతులమ్మ ఉన్నారు. ఆడపిల్లల బడి అది. కొత్తమాటల పుట్టింపు ఎలా అనేది నేను చెపుతుంటే విని, ఎనిమిదవ తరగతి పిల్లలతో ముచ్చటించింది. తొలినాడు ఒక చేర్పును గురించి చెప్పి ఒకటి రెండు మాటలను పుట్టించి చూపించింది. 'మీరు కూడా ఈ చేర్చుతో కొత్తమాటలను పుట్టించండి చూద్దాం” అని పిల్లలతో అనింది. అంతే ఆ అరగంట తరగతంతా నవ్వులతో తెలుగుమాటలతో నిండిపోయింది. పన్నెండు పదమూడేళ్ల ఈడున్న ఆ పిల్లలు అరగంటలో ఏబైకి పైగా మాటలను పుట్టించినారు. రెండవనాడు ఇంకొక చేర్సును చెప్పమని శౌరీలమ్మని బతిమాలుకొన్నారు. ఆ రెండో చేర్పుతో కూడా పదులమాటలను పుట్టించినారు. ఆ పంతులమ్మ ఎలమికి ఎల్లలు లేకుండా పోయాయి. పసిపిల్లలు కూడా మాటలు పుట్టించగలిగినంత తేలికయిన నుడి తెలుగు. త్వచకుడ్యము, తరంగదైర్భ్యము, స్వపరాగ సంపర్మము, పరపరాగ సంపర్మము, అనులోమానుపాతము, త్త్వార్జము, విశేషణోత్తరపద కర్మదారయ సమాసము, జస్త్వసంది, శ్చుత్వ సంది, క్షితిజరేక, పత్రహరితము, ద్విచక్రవాహనము, ప్రయాణప్రాంగణము, ప్రాజ్నన్నయ యుగము, ఊర్ష్వకోణము, స్నిగ్ధతాగుణకము, ఆదునికానంతర కవిత్వము, విస్తృత ఆవర్తన పట్టిక, కాంతి పరావర్తనము, విహంగవీక్షణము... వంటి నూర్లవేల పెరమాటలను దింపుకొని, వాటినే తెలుగనుకొని, వాపునే బలుపనుకొని మురిసిపోతున్నాం. ఈ పోకడను వదిలించుకొంటే కానీ మన నుడి ఎదగదు” అన్నాను.

చిన్నయ్యా నారాయణా కాసేపు ఏమీ మాట్లాడలేదు. పిమ్మట చిన్నయ్య పెదవివిప్పి, “నువ్వు కలతపడవద్దు అన్నయ్యా, ఇప్పటికి మనం ఉన్నాముగా, ముందుముందు ఇంకా కొందరు ఈ పనికి పూనుకొంటారులే” అన్నాడు.

“అది సరే అన్నయ్యా, బోదన్‌ బడిలో శౌరీలమ్మ పిల్లలకు చెప్పిన చేర్పులు ఏమిటో చెప్పవా” అడిగినాడు నారాయణ.

“చెప్పుతాను నారాయణా, వాటిలో మొదటిది 'ఎన '. కొత్త ఉరువులకు కొత్తపేర్లను పుట్టించడానికి ఈ 'ఎన ' అనే చేర్చు బాగా ఒదుగుతుంది. ఇది కూడా మన తెలుగు నుడిగంటులలో కనిపించదు. అరవ నుడిగంటులలో “ఇనం” అనేమాట కనబడుతుంది. దీని తెల్లం “జాతి” లేదా 'రేస్ '. తెన్నాటి తెలుగువాళ్లు దీనిని 'ఎనం ' అని వాడుతారు. దానికీ మన 'ఎన 'కూ పొత్తు ఉంది. 'వస్తువు ' అనేది సంసుక్రుతపు మాట. ఉరువు అనేది కూడా సంసుక్రుత రూపం నుండి తెలుగు అయిందే. మరి దీనికి తెలుగుమాట లేదా అంటే, అదే ఈ 'ఎన '. తెలుగు నుడిగంటులలో లేకపోవచ్చు కానీ తెలుగువాళ్ల నోళ్లలో మట్టుకు బాగా ఉంది ఇది. దువ్వడానికి వాడే ఎన, దువ్వు+ఎన=దువ్వెన; ఈర్చడానికి వాడే ఎన ఈర్చు+ఎన=ఈర్పెన; రెండు వంతులను కలిపే ఎన, వంతు+ఎన=

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

19