పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది




తెలుగువెలుగు తుది సంచిక

మార్చి 2021

వంటి ఇతర సంబంధాలూ ప్రేమకు సంబంధించినవే. ఆ సంబంధాలకూ చెందిన ప్రేమలేఖలూ ఉంటాయి. అవి తెలుగు వెలుగు “ప్రేమలేఖ." శీర్షిక విలక్షణంగా నడిపింది. ప్రేమలేఖల పోటీ పెట్టీ, ప్రతినెలా బహుమతి వేయినూటపదహార్లు ఇచ్చే పద్ధతి పెట్టారు. మంచి స్పందన వచ్చింది.

తెలుగు వెలుగులోని సంపాదకీయాలు ప్రత్యేక గ్రంథంగా తీసుకురావలసినవి ఉన్నాయి. తెలుగు భాషా పరిరక్షణకు పాఠ్యగ్రంథాలలో తెలుగు స్థితిగతులూ ఇటువంటి అనేక భాషా సాహిత్య విషయాలపై దొరతనాలకు నిర్మాణాత్మక సూచనలు చేస్తూ అవసర సందర్భాలలో తగు మాత్రం విమర్శలు చేస్తూ సాగిన సంపాదకీయాలు అవిస్మరణీయమైనవి. స్వతంత్ర ఆలోచనలతో భాషోద్యమకారుల ఆలోచనలతో కాంతిమంతాలైనవి. 'తులాభారం,

'కొండఅద్దంముందు ' శీర్షికల్లో గ్రంథ దీర్డ సమీక్షలూ, లఘుసమీక్షలు చేయించడం, వేయడమే కాక రచయితా లేక ప్రకాశకునికి సమీక్ష పడే సంచిక పంపే మరో మంచి సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

ప్రకటిత రచనా ప్రక్రియల్లో ఒక నాటక ప్రక్రియ తప్ప తక్కిన అన్నిటికీ స్థానకల్చన చేశారు. చలనచిత్ర కవుల, కళాకారుల, పాటల రచయితల రచనలు వేశారు. చివరకు పేరడీ రచనలనీ స్వాగతించారు. సమస్యాపూరణలు ఆసక్తి కరంగా నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో జరిగిన వర్ముషాపులకు రచయిత సభలకు, జానపద వస్తు, గిరిజన వస్తు ప్రదర్శనలకు తన ప్రతినిధుల్ని పంపించి సారాంశ ప్రధానాంశాలను సచిత్రంగా ఇచ్చారు.

శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి ఇతర దేశాల్లో గల భాషాసాహిత్య కార్యక్రమాలను తెలుగు ప్రాంత పాఠకులకు తెలిపారు. చాలామంది తక్మిన రచయితల రచనలు వెలువరించడానికి వీలుగా - ఒక రచయిత రచన ప్రచురించాక మొదటి 4 నెలల తర్వాత, తర్వాత 6 నెలల తరువాత మాత్రమే ఆయా రచయితల రచనలు వేసేవారు. భాషాదిజ్ఞానాంశాలు గ్రహించడానికి వీలుగా మాటకట్టు వేరువేరు రచయితలచే నిర్వహింపజేసేవారు.

2012 తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ సందర్భంగా అమ్మనుడి సంపాదకులు భాషోద్యమ అంకిత మూర్తులు డా॥ సామల రమేష్‌బాబు శ్రీ రామోజీరావును కలిసారు. అప్పుడు వారు శ్రీ సామల వారికి భాషోద్యమ పరంగా అనేక నిర్మణాత్మక సూచనలు చేశారు. శ్రీ రమేష్‌బాబు వంటివారి ముఖాముఖీ కార్యక్రమలు “తెలుగువెలుగు 'లో ఇచ్చేవారు. సమాజానికి అవనరమైన శ్రీ రామోజీరావుగారి అభిప్రాయ ఆలోచలనల్ని- అమ్మనుడిలో ఇచ్చేవారు.

ముచ్చటైన అచ్చు, మృదువైన పటిష్టమైన కాగితం, సంపాదకుల సరైన రచనల ఎంపికలు ఉండి - తెలుగువారి భాషోద్యమానికి వెలుగు బావుటా అయిన పత్రిక - ఆగిపోయిందా? సాహిత్య ప్రామాణిక పత్రిక - ఒక నిశ్శబ్ద చైతన్య శంఖం కాలాన్ని బద్దలు కొట్టుకొని మళ్ళీ పూరింపబడుతుందా? తెలుగు వెలుగు మళ్ళీ అక్షరాలా దృశ్య్వమానమవుతుందా? వర్తమాన కాలాన్ని ప్రశ్చిస్తే - ఆగిన తెలుగు” అని వినిపిస్తోంది. చిరస్మరణీయమైన ఆ పత్రిక ప్రామాణిక సేవలు ఎలా మరువగలం?

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

18