పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెలుగువెలుగు తొలి సంచిక

సెప్టెంబరు 2012

పెంచే శీర్షికలు. ధారావాహికలతో శిరోభార రచనలు కాకుండా నిత్యనూతన ఆలోచనలతో తెలుగు వెలుగు విజ్బంభించింది. అది 60వేల ప్రతుల పంపిణీకి ఎదిగింది. తెలుగు వెలుగు కేవలం తెలుగుభాషా సాహిత్యాలకు చెందిన పత్రిక మాత్రమే కాదు. అది తెలుగు చరిత్ర, సాంస్కృతిక, కళాసంబంధ రచనలని పొదిగించుకున్న పత్రిక.

రామోజి ఫౌండేషను నడిపిన ఈ పత్రికకు అత్మ శిరస్సు, మార్గనిర్దేశిక, సంపాదకత్వం, అన్నీ- శ్రీ రామోజీరావుగారే.

సంస్ధ ట్రస్టీ శ్రీ కిరణ్‌ ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, విధినిర్వాహణ చేసేవారికి, నిధి నిర్వాహణాది కార్యాలను ప్రోత్సాహకరంగా చేయడం - తెలుగు వెలుగు విజయానికి దోహదం చేసింది.

శాఖాధిపతిగా తెలుగు వెలుగు బాధ్యులుగా తదేక దీక్షతో- సంపాదకుల ట్రస్టీల అనుసంధాన బలంతో శ్రీ జాస్తి విష్ణుచైతన్య చేసిన సేవలు తీసుకున్న మెలకువల వల్ల - తెలుగు వెలుగు తన ముద్రను వేసుకోగలిగింది. 25 మంది ముఖ్యులైన సిబ్బందితో పత్రికను నడపడం ఆషామాషి కాదు.

చతుర పత్రిక 518 సంచికల్పి విపుల 518 సంచికల్చి బాలభారతం 94 సంచికల్ని ఇచ్చింది.

తెలుగు వెలుగు 103 సంచికలు వచ్చాయి. శ్రీ రామోజీరావు గారికీ తెలుగు వెలుగు పత్రిక పట్ల గాడాభిమానం ఉండటానికి అనేక అంశాలు సాక్షాత్మరిస్తాయి. దినపత్రికలకు రాయతీల ద్వారా వచ్చే కాగితంతో తె.వె. నడపలేదు. స్విట్టర్‌లాండ్‌ నుండి పెర్లిన్‌టాప్‌ అనే సంస్థనుండి నాజూకైన, విలువైన గట్టి కాగితాన్ని ప్రత్యేకంగా దిగుమతి చేసుకుని, ఆ కాగితాన్ని తెలుగువెలుగుకు వినియోగింపజేశారు. 60 పుటల దరిదాపు ఉండే ప్రతీ సంచికకు ఉత్పత్తి ధర ముఫ్ఫై అయిదు రూపాయలవుతుండగా 10 రూపాయలు ప్రతీ సంచికకు నష్టం వచ్చినా, తక్కువ ధరకే పత్రిక దొరకజేయడంలో లాభదృష్టిలేదు సరికదా ఏమైనా మంచి ప్రమాణాలతో నడపడమే ముఖ్యమని భావించిన- ఆదర్శ భాషా సాహిత్యాభిమాని శ్రీ రామోజీరావుగారు.

కష్టపడి, ఇష్టపడి సాహిత్య సృజన చేసే రచయితలని గౌరవించుకోవాలి. పత్రిక ద్వారా మరీ గౌరవించు కోవాలనేది వారి మంచి పూనిక.

రచనలు వెలువరించి, కనీసం ఆ రచనపడిన ప్రతులను రచయితలకు పంపడం కూడా చేయని పత్రికలు తెలుగునాట కొన్ని ఉన్నాయి.

తెలుగు వెలుగులో రచనలు ముద్రించాక రచనలు పడిన పత్రికలను విఫణివీధిలోకి అవి రాకముందే రచయితలకు చేర్చడం తెలుగువెలుగు చేబట్టింది. రచయితలకు నగదు పారితోషికాలను వారివారి బ్యాంకు అక్కౌంట్లలో జమచేయించడం తెలుగువెలుగు క్రమం తప్పకుండా చేసేది.

లెక్కకు మిక్కిలి రచనలు వస్తున్నా-అవసరమైనప్పుడు వాని ఆనుపానులు, మంచి చెడ్డలు మార్చుచేర్చుల గురించి సంపాదక వర్ణ సభ్యులు-ఆయా రచయితలతో సంప్రదించే ఆరోగ్యకర ధోరణి తెలుగు వెలుగు చేబట్టింది. అల్పసంతోషులు సహృదయులు అయిన రచయితలపట్ల ఇది ఆహ్వానించదగిన అంశం. పారితోషికాలను పంపిన్తూ రచనలు పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సౌజన్యపూరిత సంబంధాలను నెలకొల్చే అధికార లేఖలను పంపి తెలుగువెలుగు మేలుతోవలో సాగింది. తానాలో తెలుగు సభలు పెద్దఎత్తున జరిగినప్పుడు వేలకొలది సంచికలు తీసుకువెళ్ళి ఉచితంగా ప్రతినిధులకు పంపిణీ చేసిన ఉదార దృష్టి తెలుగు వెలుగు పత్రికది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వైభవోపేతంగా దొరతనం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నాలుగు కాలాలపాటు దాచుకోదగిన ప్రత్యేక సంచికను వెలువరించి తెలుగుజాతీయ భావైక్యతకు దోహదం చేసింది.

ప్రేమ అంటే కేవలం ప్రేయసీ ప్రియుల మధ్య సంబంధ వ్యక్తీకరణలు మాత్రమే కావు; తల్లిబిడ్డా, అక్కాచెల్లీ, తండ్రికొడుకూ,

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

17